దావూద్ ఇబ్రహీం బయోపిక్ వెబ్ సిరీస్..

V6 Velugu Posted on Aug 03, 2020

పాఠశాల, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌‌‌‌ను ‘యాత్ర’ పేరుతో తెరకెక్కించి మెప్పించాడు. ఇప్పుడు మరో సంచలన బయోపిక్‌‌‌‌కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సినిమా కాదు.. వెబ్‌ సిరీస్ తీయబోతున్నాడు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో దర్శక నిర్మాతలు అందరూ తమ సినిమాల ను ఓటీటీల్లో రిలీజ్ చేస్తు న్నారు. అలాగే యాక్టర్స్‌‌‌‌తో పాటు ఫిల్మ్ మేకర్లు కూడా వెబ్‌ సిరీసుల వైపు మొగ్గు చూపుతున్నారు. వారి జాబితాలో ఇప్పుడు మహి కూడా చేరుతున్నాడు.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్ర హీమ్ జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ ను తెర కెక్కించనున్నాడట. దావూద్ జీవితానికి సంబంధించిన ఎన్నో కీలక విషయాలను ఇందులో చూపించ బోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ తీస్తారట. అయితే దావూద్ ఇబ్ర హీం జీవితాన్ని తెరకెక్కించడం సాహసమే కాదు.. సాహసోపేత నిర్ణయం అంటున్నారు కొందరు సినిమా విమర్శకులు. ఎందుకంటే అతని జీవితంతో ఎన్నో వివాదాలు ముడిపడి ఉన్నాయి . ఇతర భాషల్లో దావూద్ లైఫ్‌ స్టోరీని తీసేటప్పుడు ఆయా టీమ్ లకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. అదే ఇలా అనడానికి కారణం.

Tagged upcoming, director, biopic, web series, dawood ibrahim, mahi v raghava, yatra movie director, ys rajasekhar reddy biopic

Latest Videos

Subscribe Now

More News