కొనేదెవరు.. : దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం..

కొనేదెవరు.. : దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం..

దావూద్ ఇబ్రహీం.. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ముంబైలో బాంబులు పెట్టి వందల మందిని చంపి.. పాకిస్తాన్ పారిపోయిన దేశద్రోహి.. ఇండియాలో ఉన్నప్పుడు బాగానే ఆస్తులు సంపాదించాడు.. ఇండియా నుంచి పారిపోయిన తర్వాత.. ముంబైలోని దావూద్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.. ఇప్పుడు ఆ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. 2024 జనవరి 5వ తేదీన ఈ వేలం జరగనుంది.

ముంబైలోని ఖేడ్ తాలూకా పరిధిలోని రత్నగిరి ప్రాంతంలో దావూద్ ఇబ్రహీంకు చెందిన పెద్ద బంగ్లా ఉంది. అదే విధంగా మామిడి తోట ఉంది. వీటితపాటు మరో నాలుగు ఆస్తులు సైతం రత్నగిరి ప్రాంతంలో ఉన్నాయి. వీటని పదేళ్ల క్రితమే గుర్తించి.. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. వీటిని 2024, జనవరి 5వ తేదీన వేలం వేయబోతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. 

ఇప్పటికే దావూద్ కు చెందిన ఎన్నో ఆస్తులను గతంలోనే వేలం వేసింది ప్రభుత్వం. అందులో పెట్రోల్ పంపు, ఆరు అపార్ట్ మెంట్ ప్లాట్లు, ఓ రెస్టారెంట్, ఓ గెస్ట్ హౌస్ ఉన్నాయి. టెర్రరిస్టు కార్యకలాపాల ద్వారా.. అక్రమ సంపాదనతో దావూద్ ఇబ్రహీం ఈ ఆస్తులను సంపాదించాడు. వీటిని తన పేరుతోపాటు తన కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టాల పేరుతో రిజిస్టర్ చేయించాడు. వీటిని గుర్తించిన ప్రభుత్వం.. గత పదేళ్లుగా వేలం వస్తూ వస్తుంది.

ఇప్పుడు లేటెస్ట్ గా ఖేడ్ తాలూకా రత్నగిరి ఏరియాలో ఉన్న బంగ్లా, మామిడి తోట, ఇతర ఆస్తులను వేలం వేయనున్నట్లు నోటీసులు జారీ చేసింది.