గ్రేటర్​లో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

గ్రేటర్​లో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

హైదరాబాద్/పద్మారావునగర్/కంటోన్మెంట్/ఘట్ కేసర్/వికారాబాద్, వెలుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని శనివారం గ్రేటర్​లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్​లో వివిధ కేడర్లలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులను  సూపరింటెండెంట్ డా. బి. నాగేందర్ సత్కరించారు.  సీఎస్‌‌‌‌ అడ్మిన్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎంవో డా. బి.శేషాద్రి,   సీనియర్‌‌‌‌, జూనియర్‌‌‌‌ డాక్టర్లు,  సిబ్బంది పాల్గొన్నారు. పద్మారావునగర్ హమాలీబస్తీ ప్రభుత్వ స్కూల్​లో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  పలు పోటీలు నిర్వహించి స్టూడెంట్లకు ప్రైజ్​లు అందజేశారు. 

బోయిన్​పల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్​మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంట లెక్చువల్ డిజబిలిటీ(నిపిడ్) ఆధ్వర్యంలో దివ్యాంగులైన పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. చిన్నారుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో నిపిడ్ డైరెక్టర్ బీవీ రామ్ కుమార్, డాక్టర్ దశరథ్, డాక్టర్ శిల్ప, డాక్టర్ గణేశ్, స్టూడెంట్లు పాల్గొన్నారు. ఈసీఐఎల్​ గ్రౌండ్​లో ఏవైజేఎన్​ ఎస్​హెచ్​డీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్​ రిహాబిలిటేషన్ కామన్​ ప్రీమియర్​ క్రికెట్ ​లీగ్ ​టోర్నమెంట్​లో ఎన్​ఐఈపీఐడీ(నిపిడ్) టీమ్ కప్​ గెలుచుకోగా.. ఎన్​ఐహెచ్​హెచ్​ రన్నరప్​​గా నిలిచింది. ఘట్​కేసర్​లోని నైబర్ వుడ్ సెంటర్​లో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి దివ్యాంగులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారికి ఆటల పోటీలు, క్విజ్ నిర్వహించారు. విజేతలకు ప్రైజ్​లు అందించారు. ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో ఆశ్రయ్​ ఆకృతి ఎన్జీవో ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.