కోట్లు కొల్లగొట్టిన ధోనీ శిష్యుడు.. ఇంతకీ ఎవరీ కుశాగ్ర…?

కోట్లు కొల్లగొట్టిన ధోనీ శిష్యుడు.. ఇంతకీ ఎవరీ కుశాగ్ర…?

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 2024 వేలంలో జార్ఖండ్‌ యువ వికెట్‌ కీపర్‌/బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్ర రికార్డ్ ధర పలికాడు. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలో అడుగుపెట్టిన కుశాగ్ర.. ఎవరూ ఊహించని విధంగా రూ. 7.2 కోట్ల ధర దక్కించుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ఈ యువ ఆటగాడు అద్భుత ఫామ్ లో ఉండడంతో వేలంలో ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌,  గుజరాత్‌ టైటాన్స్‌లు ఈ ఝార్ఖండ్ డైనమైట్ ను దక్కించుకోవాలని గట్టిగా పోటీ పడ్డారు. చివరకు ఢిల్లీ  భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.  

ఇంతకీ ఎవరీ కుశాగ్ర…?

కుశాగ్ర.. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ స్వరాష్ట్రం జార్ఖండ్‌కు చెందినవాడే కావడం గమనార్హం. బొకారో ప్రాంతానినికి చెందిన ఈ యువ ఆటగాడు.. 2004 లో జన్మించాడు. ధోనీని వీరాభిమాని అయిన ఈ 19 ఏళ్ళ బ్యాటర్.. రెండేళ్ల క్రితమే  దేశవాళీ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 

2021లో లిస్ట్‌ ఏ క్రికెట్‌లోకి తొలి మ్యాచ్ ఆడాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన కుశాగ్ర.. 39.45 సగటుతో 868 పరుగులు చేశాడు. గతేడాది రంజీ సీజన్‌లో భాగంగా నాగాలాండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో భాగంగా 269 బంతుల్లో 266 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పిన్న వయసులో డబల్ సెంచరీ చేసిన అతడు ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. 2022-23 విజయ్‌ హజారే ట్రోఫీలో 275 పరుగులు చేసిన అతడు.. దేవ్‌దార్‌ ట్రోఫీలో 227 రన్స్‌తో రాణించాడు.