మహబూబ్ నగర్ అర్బన్ , వెలుగు: అన్ని కులాల వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో అవకాశం కల్పించామని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్లో సోమవారం ఆయన 73 మందితో కూడిన డీసీసీ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకొని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆమోదంతో డీసీసీ కమిటీని ప్రకటించినట్లు తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షులుగా వేముల కృష్ణయ్య, బి. మధుసూదన్ రెడ్డి ఎన్.లక్ష్మినారాయణ, ఎం.వెంకట నర్సింహారెడ్డి, పోలేపల్లి యాదయ్య, సయ్యద్ మిన్హాజుద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
కోశాధికారిగా జి.రాజేందర్ రెడ్డి, అధికార ప్రతినిధులుగా కంచిని లక్ష్మణ్, బాల నర్సింలు, జీడీ నారాయణలను ఎంపిక చేశామని, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా 21 మంది, జిల్లా కార్యదర్శులుగా 22 మంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 19 మందిని ఎన్నుకున్నట్లు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం జిల్లాకు వస్తున్నట్లు తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు కంచిమి లక్ష్మణ్, గోనెల శ్రీనివాసులు పాల్గొన్నారు.
