
- జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి
చేర్యాల, వెలుగు: రాష్ట్రంలోని మహిళల అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగుతుందని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణం, మహిళా భవన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాయపల్లి అభివృద్ధే లక్ష్యంగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామ మహిళలు అడిగిందే తడవుగా తనకున్న 140 గజాల స్వస్థలాన్ని మహిళా భవనం కోసం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం మల్లేశం, కె. జీవన్‌రెడ్డి, జె. సుదర్శన్‌రెడ్డి, యం. మనోహర్, బాలనర్సయ్య, శ్రీధర్‌రెడ్డి, మంజ మల్లేశం, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.