రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయం : కూచాడి శ్రీహరి రావు

రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయం : కూచాడి శ్రీహరి రావు
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు

నిర్మల్/లక్ష్మణచాంద, వెలుగు: ఏకకాలంలో రూ.2 లక్షల మేర రైతుల రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోకు రైతులు, కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. 

కాంగ్రెస్‌‌ పార్టీ రైతు పక్షపాతి అని, మాటిస్తే నిలబెట్టుకుంటుందని శ్రీహరిరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లైబ్రరీ మాజీ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, సాద సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు రైతులు, కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. 

రూ.2 లక్షల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఒడ్నాల రాజేశ్వర్ అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నాయకులు కేశం రమేశ్, ప్రతాప్ రెడ్డి, లింగారెడ్డి, ఈటల శ్రీనివాస్, బుర్క ముత్యం తదితరులు పాల్గొన్నారు.