హుస్నాబాద్/అక్కన్నపేట/భీమదేవరపల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వద్ద వాగు దాటే క్రమంలో కొట్టుకుపోయిన దంపతుల డెడ్‌బాడీలు శుక్రవారం ఉదయం దొరికాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఇసంపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ (28), భార్య కల్పన (24)తో కలిసి బుధవారం రాత్రి బైక్‌పై అత్తగారి ఊరైన అక్కన్నపేటకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో మోత్కులపల్లి వద్ద వాగు దాటుతుండగా.. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మోత్కులపల్లి వాగు సమీపంలోని చెరువులో ఇద్దరి డెడ్‌బాడీలు కనిపించాయి. భార్య పుట్టిన రోజునాడే ఆమెతో పాటు భర్త సైతం చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
