జెప్టోలో ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్‍‍లో కుళ్లిన ఎలుక

జెప్టోలో ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్‍‍లో కుళ్లిన ఎలుక

కలుషిత ఆహారపదార్ధాలపై వస్తున్న వరుస ఘటనల వార్తలపై ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మొన్న ఐస్ క్రీంలో తెగిపోయిన మనిషి వేలు, నిన్న ఐస్ క్రీంలో జెర్రీ, తర్వాత ఫ్లైట్ లో ఆర్డర్ చేసిన భోజనంలో బ్లేడ్.. తాజాగా ఇప్పడు ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో ఆర్డర్ చేసిన హెర్షేస్ చాక్లెట్ సిరప్ లో కుళ్లిపోయిన ఎలుక కళేబరం కనిపించింది. ప్రమీ శ్రీధర్ అనే మహిళ బ్రౌనీ కేక్స్ తయారు చేసుకుందాం అని జెప్టోలో హెర్షస్ చాక్లెట్ సిరప్ ఆర్డర్ పెట్టింది. బాటిల్లో కొంచెం సిరప్ వాడిన తర్వాత ఎలుక వెంట్రుకలు వచ్చాయి. దీంతో ఏంటాఅని బాటిల్ ఓపెన్ చేసి చూస్తూ చనిపోయి కుళ్లిపోయిన ఎలుక కళేబరం అందులో ఉంది. 

ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వీడియో తీసి షేర్ చేసింది. అప్పటికే ఆ చాక్లెట్ సిరప్ ముగ్గురు తిన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి నార్మల్ గానే ఉంది.. మరో యువతి స్పృహతప్పి పడిపోయింది. ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. దీనిపై హెర్షస్  కంపెనీ స్పందించింది. ఇలా జరిగిన దానికి స్వారీ చెప్తూ.. బాటిల్ యూపీసీ మ్యానిఫాక్చర్ కోడ్ తెలపాలని కోరింది. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఫుడ్ పొల్యూషన్ పై స్ట్రాంగ్ రూల్స్ పెట్టాలని ప్రభుత్వాన్ని నెటిజన్లు కోరుతున్నారు. వరుసగా ఇలాంటి ఫుడ్ పొల్యూషన్ జరుగుతున్న వార్తలు వస్తున్నా ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఫైర్ అవుతున్నారు.