వికారాబాద్, వెలుగు: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద అమలు చేస్తున్న పాడి గేదెల పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు బాబు మోజెస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 గుంటల వ్యవసాయ భూమి గల ఎస్సీ కులాల అభ్యర్థులు https://tgobmms.cgg.gov.in వెబ్సైట్ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు ప్రతిని డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన పత్రాలను జత చేసి గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

