రాజీవ్ స్వగృహ ఇండ్లకు డీడీలు కట్టేందుకు ముగిసిన గడువు

రాజీవ్ స్వగృహ ఇండ్లకు డీడీలు కట్టేందుకు ముగిసిన గడువు

ఈ నెల 20 తర్వాత లాటరీ తీసే చాన్స్

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు టోకెన్ అమౌంట్ కట్టేందుకు సోమవారంతో గడువు ముగిసింది. ఈ రెండు ప్రాంతాల్లో ట్రిపుల్ డీలక్స్, ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 2,200 ఉండగా.. 1,800 మంది మాత్రమే డీడీలు కట్టారని హౌసింగ్ అధికారులు చెప్పారు. ఈ నెల 20 తర్వాత లాటరీ నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కువగా ట్రిపుల్ డీలక్స్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు అప్లికేషన్లు వచ్చాయని అన్నారు. రూ.40 లక్షల లోపు ధరకే ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లు అందుబాటులో ఉండటంతో ఎక్కవ మంది వీటికే డీడీలు చెల్లించినట్లు తెలుస్తున్నది. 

డబుల్, సింగిల్ బెడ్రూ ఫ్లాట్లకు రెస్పాన్స్ పెద్దగా లేదు. గతంలో అప్లికేషన్ పెట్టుకున్న వారు ట్రిపుల్ బెడ్రూమ్ కు రూ.3 లక్షలు, డబుల్ బెడ్రూమ్‌కు రూ.2 లక్షలు, సింగిల్ బెడ్రూమ్‌కు రూ.1 లక్ష టోకెన్ అమౌంట్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ పేరుతో డీడీ తీసి, హిమాయత్ నగర్‌‌లోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆఫీసులో ఇవ్వాలని హెచ్ఎండీఏ తెలిపింది. ఫస్ట్ ఫేజ్‌లో లాటరీలో ఫ్లాట్ వచ్చి టోకెన్ అమౌంట్ కట్టిన వాళ్లు ఫ్లాట్ మొత్తం 100 శాతం నగదును ఈ నెల 22 కల్లా చెల్లించాలని హెచ్ఎండీఏ తెలిపారు. ఈ గడువు ఈ నెల 1 వరకు ఉండగా 22 వరకు పొడిగించారు.