హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తులకు గడువు బుధవారం అర్థరాత్రితో ముగిసింది. రాత్రి 9 గంటలకు వరకూ 2,83,620 మంది అప్లై చేసినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఇందులో పేపర్ 1కు 80,990, పేపర్ 2కు 20,370 మంది అప్లై చేశారని పేర్కొన్నారు. రెండు పరీక్షలకు1,82,260 మంది దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అయితే మొత్తం 2,90,941 మంది ఫీజు చెల్లించారని తెలిపారు. కాగా, దరఖాస్తులకు బుధవారం సాయంత్రం 5 వరకే గడువు అని ప్రకటించినా ఆ తర్వాత12 గంటల వరకూ పొడగించారు. సాయంత్రం 6 గంటల వరకే 8 జిల్లాల్లో టెట్ సెంటర్లను అధికారులు బ్లాక్ చేశారు. హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, గద్వాల, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ తదితర జిల్లాలు ఆ లిస్టులో ఉన్నాయి.

