ప్రమోషన్లలో వివక్షకు గురవుతున్నం

ప్రమోషన్లలో వివక్షకు గురవుతున్నం
  • వైకల్యాన్ని అడ్డుగా పెట్టి అవకాశాలు ఇవ్వట్లేదు
  • డెఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆవేదన

బషీర్​బాగ్, వెలుగు: తమకు నైపుణ్యం ఉన్నప్పటికీ ప్రమోషన్లలో తీవ్ర వివక్షకు గురవుతున్నామని ఆల్ ఇండియా డెఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఆర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వైకల్యాన్ని అడ్డుగా పెట్టి అవకాశాలు కల్పించడం లేదన్నారు. శనివారం కాచిగూడలో అసోసియేషన్ 38వ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 

ఈ సందర్భంగా పీఆర్ కుమార్ మాట్లాడుతూ.. చెవిటి, మూగ వాళ్లకు బ్యాంకింగ్ రంగాల్లో ఉపాధి కల్పించే దిశగా పని చేస్తామన్నారు. 30 ఏండ్లకు పైగా సర్వీస్ ఉన్నప్పటికీ ఇంకా క్లర్క్ స్థాయిలోనే కొనసాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశాలు కలిస్తే , సాధారణ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తామన్నారు. సీనియారిటీ ప్రకారం తమకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.