
జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. తమిళంలో ఏప్రిల్ 11న ఈ సినిమా విడుదలవుతుండగా, ఒక రోజు గ్యాప్‌తో ఏప్రిల్ 12న తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ఆంధ్ర రైట్స్‌ను అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణ రైట్స్‌ను ఏషియన్ సినిమాస్ సంస్థలు కొనుగోలు చేశాయి.
ఇవి రెండు హ్యూజ్ థియేట్రికల్ బిజినెస్‌లు ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లు కావడంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అందించాడు. ఇప్పటికే తమిళంలో విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. త్వరలో తెలుగు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు. కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రలు పోషించారు.