'అదృష్టాన్ని నమ్మని వారు తప్పక చూడండి'.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

'అదృష్టాన్ని నమ్మని వారు తప్పక చూడండి'.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. ఒకరు తమ కష్టాన్ని నమ్ముకుని, అదృష్టాన్ని నమ్మని వారు, మరొకరు అదృష్టాన్ని నమ్ముకుని తదనుగుణంగా పనిచేసేవారు. కానీ కొంతమంది ఈ రెండింటికి దూరంగా ఉండి కష్టపడి పని చేస్తారు. అదృష్టం అంటూ ఏమీ లేదని నమ్మే వారు ఈ వీడియోను తప్పక చూడండి. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఎదురయ్యే పరిస్థితులు కర్మ లేదా అదృష్టంపై ఆధారపడి ఉండి జరుగుతాయని నమ్ముతారు. ఇవే జీవితాన్ని మార్చగలవని ఖచ్చితంగా అనుకుంటారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. పలు వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇటీవలే ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. దీంతో పాటు "మీకు కర్మ లేదా విధిపై నమ్మకం లేకపోతే, ఈ వీడియో మిమ్మల్ని మళ్లీ ఆలోచించేలా చేస్తుంది!" అనే క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చారు.

తృటిలో తప్పించుకున్న బాలుడు

వైరల్ అవుతోన్న ఈ వీడియో ఒక CCTV ఫుటేజీకి సంబంధిచింది. ఇందులో ఓ బాలుడు ఫుట్‌పాత్‌పై నిలబడి నిల్చొని ఉన్నాడు. అతను ఫుట్ పాత్ మీద నిలబడి ఉన్న బాడీ లాంగ్వేజ్ ను బట్టి చూస్తుంటే ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టు లేదా బోర్ కొట్టి అలా నిలబడ్డట్టు తెలుస్తోంది. అలా కాసేపు అక్కడే నించుని.. అక్కడ్నుంచి పక్కకు వెళ్లిన మరు క్షణమే ఊహించని ఘటన చోటుచేసుకుంది. అటువైపుగా వెళ్తున్న ఓ కారు హైస్పీడ్ లో వచ్చి.. పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు చెడిపోవడంతో బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. అతను ఆ స్థలంలో ఒక్క క్షణం నిలబడి ఉన్నా., ఖచ్చితంగా తీవ్రంగా గాయపడి చనిపోయేవాడు. కారు అతనికి చాలా దగ్గరగా వచ్చింది.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 9లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తూ.. భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/anandmahindra/status/1654394639389167622