పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనేది సాంస్కృతిక ఉద్యమం : గద్దర్

పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనేది సాంస్కృతిక ఉద్యమం : గద్దర్

తెలంగాణ ఎంపీలకి ప్రజా కవి గద్దర్ డిమాండ్ చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, చర్చ చేయాల్సిందిగా తెలంగాణ ఎంపీలను డిమాండ్ చేశారు. నూతన పార్లమెంటుకి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ ను కేసీఆర్ తన ఎజెండాలో చేర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆఫీసర్లు, ఉద్యోగులు ఈ డిమాండ్ కి మద్దతు తెలపాలని కోరారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనేది సాంస్కృతిక ఉద్యమన్న గద్దర్... దీన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది

అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇందిరా శోభన్ అన్నారు. ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కనాడు కూడా అంబేడ్కర్ జయంతికి, వర్థంతికి కేసీఆర్ నివాళులు అర్పించలేదని ఆరోపించారు. కేసీఆర్ కి టైం దగ్గర పడిందన్న ఆమె.. వాస్తు కారణంగానే సెక్రటేరియట్ ను కూల్చి కొత్తది కట్టారని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరికి కూడా అంబేడ్కర్ జయంతి, వర్ధంతి గుర్తుండవా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉందా? అన్న ఇందిరా శోభన్... అంబేద్కర్ ఇచ్చిన తెలంగాణని ఆమ్ ఆద్మీ పార్టీ కాపాడుకుంటుందని చెప్పారు. కేటీఆర్ కి అంబేడ్కర్ కి నివాళులు అర్పించే సమయం ఉండదు కానీ, ప్రయివేట్ హోటల్స్ ఓపెన్ చేయడానికి మాత్రం సమయం ఉంటుందా అని నిలదీశారు.