
కొండనాలుకకు మందేస్తే ..ఉన్న నాలుక ఊడినట్లు..హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం వెళితే ఏకంగా ప్రాణమీదకు వచ్చింది. జుట్టు అమర్చడం కోసం ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి శరీరం అంతా వాచిపోయింది. చివరికి ప్రాణాలే తీసింది. హెయిర్ ట్రాన్స్ ప్రాంట్ కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ ఇంజనీరు. యూపీలో ఇది రెండోది సంఘటన.
యూపీలోని కాన్ పూర్ లో బుధవారం (మే14) హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కారణంగా మయాంక్ కటియార్ (32) అనే ఇంజనీరు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఫరూఖాబాద్ కు చెందిన మయాంక్ స్థానిక ఎంపైర్ క్లినిక్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. పాంకి పవర్ హౌజ్ కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ అదే క్లినిక్ లో మృతిచెందిన తర్వాత ఇది రెండో సంఘటన. ట్రాన్స్ ప్లాంటేషన్ నిర్వహించిన డాక్టర్ అనుష్క తివారీ పరారీలో ఉంది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన మయాంక్ ఓ ప్రైవేట్ కంపెనీలు ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. మే 14న కేశవ్‌పురంలోని ఎంపైర్ క్లినిక్‌లో హెయిర్ ప్లాంటేషన్ కోసం ఎంపైర్ క్లినిక్ కు వెళ్లాడు. డాక్టర్ అనుష్క తివారి ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. ఆరోజు మొత్తం ఆస్పత్రిలో ఉన్న మయాంక్ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో మయాంక్ తీవ్రమైన తలనొప్పి ఉందని చెప్పగా డాక్టర్ అనుష్క ఇంజెక్షన్ సలహా ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. మయాంక్ రాత్రంతా నొప్పితో బాధపడ్డాడు.
►ALSO READ | తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమంటే ఇదే: హర్యానాలో పాక్ ISI ఏజెంట్, యూట్యూబర్ జ్యోతి అరెస్ట్
మరుసటి రోజు మయాంక్ ముఖంలో వాపు, తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది.కార్డియాలజిస్టుకు చూపించగా గుండెలో ఎటువంటి సమస్య లేదని చెప్పాడు. ట్రాన్స్ ప్లాంట్ చేసిన డాక్టర్ నే సంప్రదించమని సలహా ఇచ్చాడు. అయితే మయాంక్ పరిస్థితి మరింత దిగజారి చనిపోయాడు.
మయాంక్ మృతితో ఆగ్రహించిన బంధువులు ఎంపైర్ క్లినిక్ ను ధ్వంసం చేశారు. పోలీసులు ఫిర్యాదు చేశారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసిన డాక్టర్ అనుష్క తివారిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.