క్రికెట్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందికి వెళ్లిన యువకులపై పిడుగుపాటు .. మెదక్ జిల్లాలో విషాదం

క్రికెట్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందికి వెళ్లిన యువకులపై పిడుగుపాటు .. మెదక్ జిల్లాలో విషాదం

సమ్మర్ హాలిడేస్.. కాలక్షేపం కోసం స్నేహితులంతా కలిశారు. రోజూ మాదిరిగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఉన్నట్లుండి వర్షం ప్రారంభమవటంతో చెట్టుకిందకు వెళ్లారు. అంతే.. ఆ యువ కిశోరాల సరదాను చూసి మృత్యువు జీర్ణించుకోలేనట్లుంది. పిడుగు రూపంలో వాళ్ల ప్రాణాలను కబళించుకుపోయింది. మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడల్పల్లిలో జరిగింది ఈ ఘటన. వర్షానికి తల దాచుకునేందుకు సమీపంలోని చెట్టు కిందికి వెళ్లారు నలుగురు యువకులు. పిడుగు పాటుతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో ప్రసాద్ (25 ), యస్వంత్ (23) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

►ALSO READ | మూడు రోజుల్లో పెళ్లి.. లవర్తో వెళ్లిపోయిన అక్క.. ఆమె చెల్లినిచ్చి పెళ్లి చేద్దామనుకున్నరు.. ఇలా అయింది..!

ఘటన జరిగిన వెంటనే గ్రామస్తులు మిగిలిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.  

ఇద్దరు యువకులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంచి భవిష్యత్తు ఉన్న తమ బిడ్డలు ప్రాణాలతో లేరని తీవ్రంగా రోధిస్తున్నారు తల్లిదండ్రులు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు. వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచించారు. వర్షం వస్తే వెంటనే ఇట్లకి వెళ్లిపోవాలని కోరారు.