వాచ్ డాగ్ శాటిలైట్..ఇస్రో కొత్త ఉపగ్రహం రేపు(మే18)లాంచ్

వాచ్ డాగ్ శాటిలైట్..ఇస్రో కొత్త ఉపగ్రహం రేపు(మే18)లాంచ్

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల మధ్య శాటిలైట్ల ప్రాధాన్యత బాగా పెరిగిది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. శాటిలై

 డైరెక్షన్ లో  ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ క్రమంలో శాటిలైట్ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన సమయం వచ్చిందని ఇస్రో ప్రకటించింది. రాత్రిపూట చూడగల ఉపగ్రహాన్ని రేపు (ఆదివారం ) ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 

ఆదివారం(మే17) ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచిఈ రాడార్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా ఈ శాటిలైట్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో 101వ పెద్ద రాకెట్ ప్రయోగం ఇంది. 1,696 కిలోగ్రాముల EOS-9 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుంచి 500 కి.మీ.ల ఎత్తులో ఉంచనున్నారు.

►ALSO READ | ప్యూర్తో చేతులు కలిపిన చార్జ్ యూఎస్ మార్కెట్లోకి ఎంట్రీ

స్వదేశీగా తయారు చేయబడిన "గూఢచారి" ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఇస్రో యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం రూపొందించింది. సి-బ్యాండ్ సింథటిక్ ఎపర్చరు రాడార్‌తో అమర్చబడి ఉంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితులలో తక్కువ కాంతిలో భూమి ఉపరితలం కు సంబంధించి అధిక- రిజల్యూషన్ చిత్రాలను సంగ్రహించడానికి వీలు కల్పిస్తుంది. రాత్రిపూట ఉపయోగించే కార్టోసాట్-3 ఉపగ్రహంతో పోలిస్తే ఈ శాటిలైట్ బెస్ట్ క్వాలిటీ ఫొటోలను తీస్తుంది. భూమికక్ష్యనుంచి అరకిలోమీటర్ కంటే తక్కువ ఎత్తులో ఎక్కువ రెజల్యూషన్ తో ఫొటోలను తీస్తుంది.దేశ భద్రతకోసం ఇప్పటికే 10 ఉపగ్రహాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. దాదాపు 7వేల కిలోమీటర్ల  సముద్ర తీరప్రాంతాలను, మొత్తం ఉత్తర భాగాన్ని పర్యవేక్షించారు. ఉపగ్రహ, డ్రోన్ టెక్నాలజీ లేకుండా ఇది సాధ్యంకాదు అని ఇస్రో అన్నారు. 

ఈ మిషన్ గురించి మాట్లాడిన నారాయణన్.. కేంద్ర అంతరిక్ష ,సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, "ఖచ్చితత్వం, జట్టుకృషి ,ఇంజనీరింగ్ భారతదేశ అంతరిక్ష ఆశయాలకు శక్తినిస్తాయి" అని అన్నారు.