ప్యూర్తో చేతులు కలిపిన చార్జ్ యూఎస్ మార్కెట్లోకి ఎంట్రీ

ప్యూర్తో చేతులు కలిపిన చార్జ్ యూఎస్ మార్కెట్లోకి ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు: గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్యూర్​, యునైటెడ్ స్టేట్స్ (యూఎస్), కెనడా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించడానికి చార్జ్ పవర్‌‌‌‌‌‌‌‌తో వ్యూహాత్మకంగా స్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా ప్యూర్​ తన అత్యాధునిక బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ  సొల్యూషన్స్​ను ఉత్తర అమెరికా మార్కెట్‌‌‌‌‌‌‌‌కు పరిచయం చేయనుంది.

ఈ భాగస్వామ్యం గురించి ప్యూర్​ సీఈఓ మాట్లాడుతూ, "చార్జ్ పవర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. యూఎస్,​  కెనడా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో చాలా అవకాశాలు ఉన్నాయి. చార్జ్  బలమైన పునాది, అనుభవం మాకు ఈ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి విజయవంతంగా ప్రవేశించడానికి సహాయపడుతుంది " అని అన్నారు.