
హైదరాబాద్, వెలుగు: శాసన సభలో బడ్జెట్ పద్దులు, ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం ఇవ్వాలని బీఏసీ సమావేశంలో కోరామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కావడం లేదని, కాబట్టి దానిపై షార్ట్ డిస్కషన్ జరపాలని కోరినట్టు చెప్పారు.
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సమస్యలపై చర్చ జరపాలని, సింగరేణి బొగ్గు గనులపై కూడా చర్చ జరపాలని కోరామని పేర్కొన్నారు. కనీసం 15 రోజులు శాసనసభ జరిగితే బాగుంటుందని వెల్లడించారు.