పార్లమెంట్ ఉభయసభల్లో పలు బిల్లులపై చర్చ

పార్లమెంట్ ఉభయసభల్లో  పలు బిల్లులపై చర్చ

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు పదిహేనో రోజు కూడా ప్రతిపక్షాల నిరసనలతోనే మొదలయ్యాయి. శుక్రవారం లోక్​సభ, రాజ్య సభ మొదలైన గంటలోపే వాయిదా పడ్డాయి. ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు ధరల పెరుగుదల, ఈడీ దాడుల వంటి అంశాలపై నిరసనలు తెలిపారు. తిరిగి సమావేశమయ్యాక రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికల తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం ఆరోగ్య హక్కు బిల్లు, 2021పై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్ సుఖ్ మాండవీయ సమాధానం ఇచ్చారు. దేశంలో హెల్త్ కేర్ సేవల మెరుగుదలకు కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్​ను క్రమంగా పెంచామన్నారు. లోక్ సభలోనూ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్షాల నిరసనల మధ్యే జీరో హవర్ కొనసాగింది.