ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి తగ్గుతున్న గిరాకీ.. పడిపోయిన గోల్డ్ రేట్లు!

ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి తగ్గుతున్న గిరాకీ.. పడిపోయిన గోల్డ్ రేట్లు!

న్యూఢిల్లీ: గ్లోబల్​మార్కెట్లలో గిరాకీ తగ్గడంతో ఢిల్లీలో బుధవారం (జులై 10) బంగారం ధరలు రూ. 700 తగ్గి రూ. 98,420 పది గ్రాములకు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.

 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర మునుపటి మార్కెట్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 99,120 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 98వేలకు పడిపోయింది. ఇది మంగళవారం రూ. 98,600 వద్ద ముగిసింది.  

కిలో వెండి ధర బుధవారం రూ. 800 తగ్గి రూ. 1.04 లక్షలకు చేరింది. మునుపటి మార్కెట్ ముగింపు ధర రూ.1.04 లక్షలు ఉంది.  గ్లోబల్​ స్పాట్ బంగారం ఔన్సుకు (28.3 గ్రాములు) 12 డాలర్లు తగ్గి  3,289.81 డాలర్లకు చేరింది.