యాదాద్రి, వెలుగు: యాదాద్రి కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగుల కోసం విశ్రాంతి గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఎన్నికల సామగ్రి భద్రపరచడానికి ఉపయోగించిన గదిని మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా కేటాయించారు. లంచ్‌తో పాటు విశ్రాంతి తీసుకోవడానికి ఈ గదిని ఉపయోగించుకోనున్నారు.
ఈ గదిని కలెక్టర్హనుమంతరావు ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ఏ. భాస్కరరావు, డీఆర్వో జయమ్మ, డీసీఎస్వో రోజా, డీపీఆర్వో అరుంధతి, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
