ధోనీ వల్లే పవర్ ప్లే బౌలరయ్యా

V6 Velugu Posted on May 22, 2021

ఓవైపు విరాట్​నేతృత్వంలోని టీమిండియా.. ఇంగ్లండ్​ టూర్​ కోసం సిద్ధమవుతుంటే.. మరోవైపు నేషనల్​ టీమ్​పై ఆశలు పెట్టుకున్న కుర్రాళ్లందరూ​.. శ్రీలంక టూర్​ కోసం ఎదురుచూస్తున్నారు..! ఇప్పటివరకు షెడ్యూల్​ ఖరారు కాకపోయినా.. లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ రెండు సిరీస్​ల్లో తనకు చోటు దక్కుతుందని పేసర్​ దీపక్​ చహర్​ నమ్మకంగా  ఉన్నాడు..! మాజీ కెప్టెన్​ధోనీ వల్లే.. తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పిన చహర్​.. తాను పవర్ ప్లే బౌలర్​గా ఎదగడంలో మహీ పాత్ర చాలా కీలకమన్నాడు...! తనపై ధోనీ ఇంపాక్ట్​తో పాటు లంక టూర్​ గురించి చహర్​ పంచుకున్న విషయాలు ఏంటో చూద్దాం..!!

న్యూఢిల్లీ: డొమెస్టిక్​ టోర్నీలతో పాటు ఐపీఎల్​ వల్ల టీమిండియా రిజర్వ్ బెంచ్ బలం విపరీతంగా పెరిగింది. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం పది మంది దాకా యంగ్​ క్రికెటర్లు క్యూలో ఉంటున్నారు. వీళ్లందరి టార్గెట్​ టీమిండియానే అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ మందికే నేషనల్​టీమ్‌‌లో ప్లేస్​ దొరుకుతుంన్నది. గట్టిపోటీ మధ్యలో జట్టులో ప్లేస్‌‌ దక్కించుకున్న కుర్రాళ్లలో టాలెంటెడ్​పేసర్​ దీపక్​ చహర్​ ఒకడు. ప్రస్తుతం లంక టూర్​ కోసం  ఎదురుచూస్తున్న అతను.. తనతో పాటు మిగతా ప్లేయర్ల గురించి స్పందించాడు. అవి.. అతని మాటల్లోనే..

శ్రీలంకలో రాణిస్తా..

నేను లంక టూర్​ కోసం ఆతృతగాఎదురుచూస్తున్నా. ఐపీఎల్​లో బాగా బౌలింగ్​ చేశా. మంచి టచ్​లో ఉన్నా. ఎక్స్​పీరియెన్స్​ కాన్ఫిడెన్స్​ను పెంచుతుందని బలంగా నమ్ముతా. నాకు ఆ ఎక్స్​పీరియెన్స్​ ఉంది. అందుకే లంకలో మంచి షో చేస్తానని అనుకుంటున్నా. కచ్చితంగా మేం గెలుస్తామనే నమ్మకమైతే ఉంది. చూడటానికి ద్వితీయ శ్రేణి జట్టు అయినా.. కచ్చితంగా మెయిన్​ టీమ్​ను తలపిస్తాం. మాకు చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. ఎక్స్​పీరియెన్స్​తో పాటు నాణ్యమైన కుర్రాళ్లు కూడా ఈ టూర్​కు వస్తారని అనుకుంటున్నా. 

లంక టూర్​కు కెప్టెన్​గా ధవన్​ బెస్ట్​

కెప్టెన్సీకి పోటీ  ఎక్కువగా ఉన్నా.. శిఖర్​ ధవన్​ బెస్ట్​ చాయిస్ అని నా అభిప్రాయం. ధవన్‌‌ చాలా కాలం నుంచి క్రికెట్​ ఆడుతున్నాడు. మంచి ఎక్స్​పీరియెన్స్ కూడా ఉంది.  సీనియర్​ ప్లేయర్​ కెప్టెన్​ అయితే బాగుంటుందని నేను నమ్ముతా. మిగతా వాళ్లు కూడా సీనియర్ అంటే రెస్పెక్ట్​ ఇస్తారు. అతనితో నిజాయితీగా మెలుగుతారు. ప్రతి ప్లేయర్​కు తన కెప్టెన్​ అంటే గౌరవం ఉండాలి. అందుకే టీమ్​లో సీనియర్​ అయిన ధవన్​ అయితేనే బెస్ట్​ అనుకుంటున్నా. 

ధోనీ ప్రభావం చాలా ఉంది..

నాపై, నా కెరీర్​పై ఎంఎస్‌‌ ధోనీ ప్రభావం చాలా ఉంది. మహీ భాయ్​ సారథ్యంలో ఆడాలన్నది నా కల. అతని కెప్టెన్సీలో నేను చాలా నేర్చుకున్నా. అతని గైడెన్స్​తోనే నా గేమ్​ను వేరే లెవెల్​కు తీసుకెళ్లా. నన్ను బాగా సపోర్ట్‌‌ చేయడంతోపాటు బాధ్యత తీసుకోవడం నేర్పించాడు. ఐపీఎల్‌‌లో పవర్​ప్లేలో నేను వరుసగా మూడు ఓవర్లు బౌలింగ్​ చేస్తున్నానంటే అది మహీ వల్లే. సీఎస్​కేలో మరే బౌలర్​అలా వేయడు. నేను వేస్తున్నానంటే.. అది మహీ వల్లే  సాధ్యమైంది. ఓ జట్టు తరఫున ఫస్ట్​ బౌలింగ్ వేయాలంటే అది అనుకున్నంత ఈజీ కాదు. కానీ నేను నేర్చుకున్నా. టీ20ల్లో రన్స్​ను ఎలా కంట్రోల్​ చేయాలో, వికెట్లు ఎలా తీయాలో ధోనీ నాకు  స్పష్టమైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. వాటి వల్లే సక్సెస్​ అయ్యా. మహీ భాయ్​ నన్ను పవర్​ప్లే బౌలర్​గా తయారు చేశాడు. నువ్వెప్పుడూ నా పవర్​ప్లే బౌలర్‌‌వి అని నన్ను  ప్రోత్సహించేవాడు. చాలాసార్లు నాకు ఫస్ట్​ ఓవర్​ ఇచ్చేవాడు. అలాగే  తప్పు చేస్తే తిట్టేవాడు (నవ్వుతూ) కూడా.  ఆ తిట్లు, గైడెన్స్​ నేను ఎదగడానికి ఎంతో సాయపడ్డాయని నాకు తెలుసు.  ఓ బౌలర్​గా నేను ఎదిగానంటే వాటి వల్లే. ప్లేయర్ల  స్ట్రెంత్​ ఏంటో మహీకి బాగా తెలుసు. అందుకే చాలా తెలివిగా బౌలర్స్​ను ఉపయోగించుకుంటాడు. డెత్​ ఓవర్లలో ఎవరు బెస్ట్​, పవర్​ప్లేలో ఎవరితో వేయించాలి.. మిడిల్​ ఓవర్స్​ ఎవరికి ఇవ్వాలి. ఇలా ప్రతి అంశంపై ఫుల్ క్లారిటీతో ఉంటాడు. అందుకే అతని సారథ్యంలో ఆడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. 

ఐపీఎల్​ పోస్ట్​పోన్​పై..

బబుల్ ఎలా బ్రీచ్​ అయిందో తెలియకపోయినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను బీసీసీఐ చాలా బాగా హ్యాండిల్​ చేసింది. ఏ ప్లేయర్​కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కర్ని సేఫ్​గా స్వస్థలాలకు చేర్చింది. ముఖ్యంగా ఫారిన్​ ప్లేయర్లను చాలా జాగ్రత్తగా, స్మూత్​గా పంపించింది. ప్లేయర్​ వల్ల బబుల్​ బ్రీచ్ అయ్యిందని నేను అనుకోను. కానీ ఒక్కసారి బబుల్ కంటామినేట్​ అయిన తర్వాత తిరిగి రీబిల్డ్​చేయడం అసాధ్యం. ఒకవేళ చేయాలన్న చాలా టైమ్​ పడుతుంది. టీమ్​ల్లో కరోనా​ కేసులు వస్తాయని  ఎవరూ ఊహించలేదు. అయినా మా అందర్ని చాలా సేఫ్​గా పంపించిన బీసీసీఐకి హ్యాట్సాఫ్​. 

రెడ్​ బాల్​ డ్రీమ్​..

దేశం తరఫున టెస్ట్​ క్రికెట్​ ఆడాలని ప్రతీ క్రికెటర్​ కోరుకుంటాడు. దీపక్​ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. 2018లో ఇంగ్లండ్​పై టీ20 అరంగేట్రం చేసిన దీపక్​.. ఇప్పటిదాకా 2 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. ఇప్పుడు ఐదు రోజుల ఫార్మాట్​ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఇండియా తరఫున టెస్ట్​ క్రికెట్​ ఆడటం నా డ్రీమ్. రెడ్​ బాల్​ను ఎలా స్వింగ్​ చేయాలో నాకు బాగా తెలుసు. స్వింగింగ్​ కండీషన్స్​ను నాకు ఫేవర్​గా మల్చుకోవడమూ తెలుసు. ప్రస్తుతం టెస్ట్​ టీమ్ ఇంగ్లండ్​కు వెళ్తున్నది. వాళ్లకు ఆల్​ ది బెస్ట్​. ఇంగ్లిష్​ కండీషన్స్​లో బౌలింగ్​ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంగ్లండ్​లో నేను కూడా ఆడా. నా బౌలింగ్​ను బాగా ఆస్వాదించా. ఏదో ఓ రోజు సెలెక్టర్లు నాకూ చాన్స్‌‌​ ఇస్తారని అనుకుంటున్నా. వైట్​బాల్​ ఫార్మాట్స్​లో ప్రూవ్​ చేసుకున్నా కాబట్టి టెస్ట్​ జట్టుకు పిలుపు వస్తుందని నమ్మకంగా ఉన్నా’ అని దీపక్‌‌ చహర్‌‌ చెప్పాడు.

Tagged India, MS Dhoni, deepak chahar, powerplay bowler

Latest Videos

Subscribe Now

More News