
మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో రెండో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 2,0 తో క్లీన్ స్వీప్ చేసింది టీంఇండియా. అయితే ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డు నమోదు చేశారు యంగ్ క్రికెటర్స్ దీపక్ హుడా, సంజూ శాంసన్ . టీంఇండియా తరఫున టీ20 ఫార్మాట్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఇషాన్ కిషన్‌కు జోడీగా బరిలోకి దిగాడు సంజూ శాంసన్. ఈ క్రమంలో 42 బంతుల్లో 77(9 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు సాధించాడు. ఇక మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ విఫలం(3) కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ కలిసి 87 బంతుల్లో 176 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్ కలిసి చేసిన 165 పరుగుల అత్యుత్తమ భాగస్వామ్యాన్ని బద్దులుకొట్టినట్టు అయింది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే దీపక్ హుడా, సంజూ శాంసన్ ఇద్దరు చిన్నప్పటి స్నేహితులు కావాడం.