
ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ టెస్టుకు ఒక రోజు ముందు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం (జూలై 2) ఇంగ్లాండ్ తో బర్మింగ్‌హామ్‌లో టీమిండియా రెండో టెస్ట్ ఆడనుంది. అయితే బర్మింగ్‌హామ్‌లోని సెంటెనరీ స్క్వేర్ ప్రాంతంలో అనుమానాస్పద ప్యాకేజీ దొరికిందనే నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు సమాచారం.
అక్కడి భారత జట్టు హోటల్ లోపలే ఉండాలని సూచించారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్ ముందు రోజు ప్రాక్టీస్ సెషన్ తర్వాత జట్టు తమ హోటల్‌కు తిరిగి వచ్చింది. అనుమానాస్పద పార్శిల్ ఉందనే కారణంగా ఆటగాళ్లను బయటకు వెళ్లవద్దని కోరారు.
Also Read : ఛాంపియన్స్ లీగ్ స్థానంలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్
బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్ పోలీసులు మంగళవారం (జూలై 1) సోషల్ మీడియా ద్వారా జారీ చేసిన హెచ్చరిక తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత జట్టు రెస్టారెంట్లు, నైట్ లైఫ్‌కు ప్రసిద్ధి చెందిన రద్దీగా ఉండే బ్రాడ్ స్ట్రీట్ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇక్కడకు తరచుగా ఆఫ్ డేస్‌లో ఆటగాళ్ళు ఇక్కడకు వస్తారు.
సోషల్ మీడియా ద్వారా ఎక్స్ పోస్ట్ చేయబడిన పోలీసు ప్రకటన ఇలా పేర్కొంది: “మేము ప్రస్తుతం బర్మింగ్‌హామ్ నగర కేంద్రంలోని సెంటెనరీ స్క్వేర్ చుట్టూ ఒక కార్డన్‌ను ఏర్పాటు చేసాము. అనుమానాస్పద ప్యాకేజీని పరిశీలిస్తున్నాము. మధ్యాహ్నం 3 గంటలకు ముందే మాకు సమాచారం అందింది. దానిని అంచనా వేసేటప్పుడు ముందుజాగ్రత్తగా అనేక భవనాలను ఖాళీ చేయించారు. దయచేసి ఆ ప్రాంతాన్ని నివారించండి.”
హెచ్చరిక జారీ అయిన దాదాపు గంట తర్వాత, పోలీసులు కార్డన్‌ను ఎత్తివేసి, ఆ ప్రాంతం సురక్షితంగా ఉందని నిరాధారించిన తర్వాత సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో సహా ఎనిమిది మంది ఆటగాళ్ళు ప్రాక్టీస్ కోసం ఎడ్జ్‌బాస్టన్‌కు చేరుకున్నారు.