
బర్మింగ్‌హామ్ వేదికగా ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో భారత్ టాస్ ఓడిపోవడం వరుసగా ఇది రెండో సారి. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ తుది జట్టులో స్థానం సంపాదించారు. బుమ్రాకు రెస్ట్ ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్ లను పక్కన పెట్టింది.
భారత్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
►ALSO READ | IND VS ENG 2nd Test: టీమిండియా హోటల్ దగ్గర అనుమానాస్పద ప్యాకెట్ : ఆటగాళ్ల బయటకు రావొద్దంటూ హెచ్చరికలు