Siddharth Roy Trailer: అర్జున్ రెడ్డిలా..సిద్ధార్థ్ రాయ్..ట్రైలర్ తోనే ఇచ్చిపడేశాడుగా

Siddharth Roy Trailer: అర్జున్ రెడ్డిలా..సిద్ధార్థ్ రాయ్..ట్రైలర్ తోనే ఇచ్చిపడేశాడుగా

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ తరహాలో మరో సినిమా రాబోతుంది. లేటెస్ట్గా రిలీజైన సిద్ధార్థ్ రాయ్ (Siddharthroy) మూవీ ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. మహేశ్ బాబు అతడు మూవీలో కమెడియన్ బ్రహ్మానందం పొట్టపై చిన్న పంచ్ ఇచ్చి..మన స్కూల్ బెంచ్‌లా ఎంత గట్టిగా ఉందోరా..అనే డైలాగ్తో ఆకట్టుకున్న బుడ్డోడు అందరికీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. అతడులో నటించిన అతనే దీపక్ సరోజ్ (Deepaksaroj). ఇప్పుడు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రాయ్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. 

ఇవాళ (జనవరి 23) ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్తో దీపక్ తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. బలమైన భావోద్వేగాలతో కూడిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన వి యశస్వి (V Yeshasvi)..ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ట్రైలర్ విషయానికి వస్తే..మై కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ డిఫెరెంట్..దిస్ ఈజ్ సిద్ధార్ధ్ రాయ్..మై ఏజ్ 21 అంటూ హీరో చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అవ్వగా..అమ్మాయిలని లైటర్ ఉందా..లేదంటే కండోమ్ ఉందా అంటూ అర్జున్ రెడ్డి మేనియాను గుర్తుచేస్తున్నాడు. అంతేకాదు..క్లాస్ రూమ్ లోనే రొమాంటిక్ సీన్స్తో చూపించిన ట్రైలర్ యూత్ను ఆకట్టుకుంటోంది.

తిండి, నిద్ర, శృంగారం..ఈ మూడు ఉంటే చాలు అనుకునే..తన జీవితంలోకి వచ్చిన ఇందు..నిజమైన ప్రేమ ఏంటో చూపేంచేలా ఉంది. ఇక అర్జున్ రెడ్డి మూవీకి మ్యూజిక్ అందించిన రధన్‌..ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  

ఈ మూవీకి కెమెరామెన్ శ్యామ్‌ కె నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి పనిచేస్తుండగా..కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వి.యశస్వి కావడం విశేషం. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ట్రైలర్ తోనే యూత్ని ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ రాయ్ మూవీ ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేస్తున్నారు.