Deepavali 2025: దీపావళి అక్టోబర్ 20 నా.. 21 నా.. ఎప్పుడు జరుపుకోవాలి..

Deepavali 2025:  దీపావళి అక్టోబర్ 20 నా.. 21 నా.. ఎప్పుడు జరుపుకోవాలి..

హిందువులు మరో పెద్ద పండుగను జరుపుకొనేందుకు సిద్దమవుతున్నారు. అదేనండి టపాసుల ఫెస్టివల్​.  ప్రతి ఏడాది ఈ పండుగను ఆశ్వయుజమాసం అమావాస్య రోజున జరుపుకుంటారు.  ఈ ఏడాది( 2025) లో దీపావళి పండగ ఎప్పుడు వచ్చింది? ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

ఆశ్వయుజ  అమావాస్య రోజున జరుపుకునే   దీపావళి పండగను జరుపుకునే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంపై పండితులు క్లారిటి ఇచ్చేశారు.   

దీపావళి పండుగ  తేదీ, సమయం

  •  ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి ప్రారంభం :  అక్టోబర్ 20 న తెల్లవారుజామున 3:44 గంటలకు 
  • ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి ముగింపు :  అక్టోబర్ 21, 2025న ఉదయం 5:54 గంటలకు 
  •  కనుక  దీపావళి పండుగను అక్టోబర్ 20 సోమవారం నాడు జరుపుకోవాలి.

లక్ష్మీ-గణపతి పూజ పద్ధతి

దీపావళి రోజున ( అక్టోబర్​ 20) హిందువులు లక్ష్మీగణపతిని పూజిస్తారు.  కొంతమంది కేదారీశ్వర వ్రతం కూడా వారి కుటుంబ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు . ఇంటిప్రధాన ద్వారం దగ్గర ఇరువైపుల దీపాలు వెలిగిస్తారు.  ఆ తరువాత రోజు నుంచి అంటే అక్టోబర్​ 21 వ తేదీ నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. 

ALSO READ : ఈ అద్భుత పౌర్ణమి నుంచి రాబోయే పౌర్ణమి వరకు..

 

  •  ముందుగా ఇంటిని శుభ్రం చేయాలి.
  • దేవుడి దగ్గర.. గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించాలి
  • పూజ చేసే స్థలాన్ని  గోమయంతో శుద్ది చేయాలి.
  •  పీట వేసి ఎర్రని వస్త్రం వేసి .. కేజీంపావు బియ్యంపోసి.. లక్ష్మీ గణపతి.. కుబేరుని విగ్రహాలను కాని.. చిత్రపటాలను కాని ఉంచాలి.
  • ముందుగా వినాయకుడిని పూజించండి.. పసుపు.. కుంకుమ. చందనంతో పాటు కచ్చితంగా గరిక ఉండేలా చూసుకోండి.
  • లక్ష్మీదేవిని పూజించి..అమ్మవారికి తామర పువ్వులు, సింధూరం, అక్షతలు, పసుపు, సుగంధ ద్రవ్యాలు, స్వీట్లు, పండ్లు సమర్పించండి.
  •  క్షీరాన్నం ( పాయసం) నైవేద్యంగా సమర్పించండి.
  •  కుటుంబ సభ్యులు అందరూ కలిసి హారతి ఇచ్చి.. సాష్టాంగ నమస్కారం చేయండి.
  • వ్యాపార సంస్థల వారు కొత్త ఖాతా పుస్తకాలు.. గల్ల పెట్టె..( డబ్బులు వేసుకొనే పెట్టె)ను పూజ దగ్గర ఉంచాలి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.