జ్యోతిష్యం : ఈ అద్భుత పౌర్ణమి నుంచి రాబోయే పౌర్ణమి వరకు.. ఈ 30 రోజులు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..?

జ్యోతిష్యం : ఈ అద్భుత పౌర్ణమి నుంచి రాబోయే పౌర్ణమి వరకు.. ఈ 30 రోజులు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..?

జ్యోతిష్య శాస్త్రంలో  గ్రహాల కదలికల కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితమవుతాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుంచి ... కార్తీకమాసం పౌర్ణమి వరకు ( నవంబర్​ 5 వ తేది వరకు )  వ తేదీవరకు   గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఏ రాశి వారికి ఎలా ఉందో  వివరంగా తెలుసుకుందాం. . .!.

అక్టోబర్ నెలలో 6,7 తేదీలలో ఏర్పడిన  పౌర్ణమి జ్యోతిషశాస్త్ర ప్రకారం అన్ని రాశులను ప్రభావితం  చేస్తుందని పండితులు చెబుతున్నారు.  గురుడు.. చతురస్ర వలయాన్ని ఏర్పరచుకోవడం..  గురుడు, శని గ్రహాలపై శుక్రుడి దృష్టి ఉండటంతో ప్రేమ సంబంధ విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి.  ఈ గ్రహాల మార్పు ప్రభావం కార్తీకమాసం పౌర్ణమి వరకు ( నవంబర్​ 5 వ తేది వరకు ) ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబతున్నారు. 

మేషరాశి: ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది.   జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.   వ్యక్తిగతంగా వృద్ధిచెందే అవకాశాలున్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి కావడమే కాకుండా.. ఇబ్బందులు తొలగి .. ప్రతి పనిలో కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్​ రావడం.. కొత్త ప్రాజెక్ట్​ లు చేపట్టే అవకాశం ఉంది. ప్రేమికుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. 
 
వృషభరాశి:  ఈ రాశి వారికి  నవంబర్​ 5 వతేది వరకు  సానుకూల ఫలితాలొస్తాయి.  అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది.  కెరీర్​ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   ఉద్యోగస్తులకు  అధికారుల నుంచి  ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం డ్రైవింగ్​ అప్రమత్తంగా ఉండాలి.  ఆహారం విషయంలో కూడా శ్రద్ద తీసుకోవాలి.  ఆరోగ్యపరంగా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  

మిథున రాశి:ఈ రాశి వారు  సామాజిక సంబంధాలు .. నెట్‌వర్కింగ్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు.   కొత్త పరిచయాలు  ఏర్పడటంతో  వ్యక్తిగత జీవితంలో విశేష ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు ..చికాకులు ఉంటాయి.  ప్రతి పనిలో కూడా ఆలస్యం జరిగినా..  కొత్త తరహా ఆలోచనలకు అమలు పరచడంతో  మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలొస్తాయి. మీరు అందరికంటే విభిన్నంగా పని చేస్తారు.  ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారస్తులు లాభాల బాట పడతారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు  అవకాశాలు కలసి వస్తాయి. కెరీర్ పరంగా  ప్రశంసలు లభిస్తాయి. వృత్తిలో విజయం సాధిస్తారు. 

కర్కాటక రాశి :  ఈ రాశి వారు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో  గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో శుభ ఫలితాలతో పాటు.. ఆస్తి, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడతారు.  ఇక అమ్ముడు పోవు అనుకున్న వస్తువులు.. వెంటనే సేల్​ అవుతాయి. కుటుంబసభ్యల మధ్య వివాదాలు పరిష్కారం కావడంతో సంతోషకరంగా గడుపుతారు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. 

సింహరాశి : ఈ రాశి వారు  కెరీర్​ విషయంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్​ల విషయంలో శ్రద్ద చూపుతారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది.వ్యాపారస్తులు   కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.  అయితే ఖర్చులను నియంత్రించుకోవాలి.వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు  తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది.

కన్య రాశి:  ఈ రాశి వారు  ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.  బంధువులు.. స్నేహితులతో  దగ్గరి సంబధాలు కొనసాగిస్తారు.  అక్కరకు రానివారిని వదిలించుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త  బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.వ్యాపారాలలో లాభాలు వస్తాయి భూములకు సంబంధించిన సానుకూల ఫలితాలు చూస్తారు.  పూర్వీకుల నుండి ఆస్తి కలసి వస్తుంది. ఆహారం విషయంలో శ్రద్ద తీసుకోవాలి.  ఆర్థిక పరిస్థితిలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.  అనవసర ప్రయాణాలు ఆందోళన కలిగించే అవకాశం ఉంది.  

తులారాశి:  ఈ రాశి వారికి చెందిన స్నేహ సంబంధాలకు .. భాగస్వామ్య బంధాలకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.  ఒక్కో సమయంలో ఏకాకిగా మిగిలిపోయే అవకాశం ఉంది. అయినప్పటికి గురువు శుభదృష్టి వలన    ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.   ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. ఇతరులు దానిని పనిష్మెంట్​ అనుకుంటారు.   వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.  పెళ్లి కోసం ఎదురుచేసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.  ప్రేమ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
 
వృశ్చికరాశి:  ఈ రాశి వారు బిజీగా ఉండి ఆధిపత్యం చలాయిస్తారు. ఉద్యోగస్తులు పనిపై శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఎవరిని నమ్మవద్దు.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న మోసపోయే  అవకాశాలున్నాయి.   ఆస్తి వ్యవహారాల్లో  అప్రమత్తంగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.  ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  మీరు మంచి చెప్పినా తప్పుగా అర్దం చేసుకుంటారు. బంధువులు.. స్నేహితులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి:ఈ రాశి వారు ఎలాంటి రిస్క్​ తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు.    ఆరోగ్యం మరియు విలువైన వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.  ఉద్యోగస్తులకు అధికారుల నుంచి.. సహోద్యోగుల నుంచి  సహకారం ఉండదు.  అయినా సరే చాలా ఓర్పు.. సహనాన్ని పాటించండి. వ్యాపారస్తులకు లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి.  కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది.  అక్టోబర్​ నెల 20 వ తేదీ నుంచి  ఉపశమనం కలుగుతుంది. అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి.  సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

►ALSO READ | ఈ రాత్రికి( అక్టోబర్ 7) ఆకాశంలో అద్భుతం : నారింజ రంగులో చంద్రుడు

మకర రాశి:  ఈ రాశి వారు కొత్తగా ఇల్లు నిర్మాణం చేపట్టడం కాని.. కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది.  దృష్టి ఇల్లు, కుటుంబం లేదా స్థిరాస్తిపైకి మారుతుంది. గృహ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి.వ్యాపారం.. ఉద్యోగ రంగాల్లోని వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పరిష్కారం అవుతాయి.     గతంలో ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి.  ఉద్యోగస్తులు కేరీర్​ విషయంలో.. వ్యాపారరస్తులు ..  తీసుకునే నిర్ణయాలు జీవితంలో కీలకం కానున్నాయని పండితులు చెబుతున్నారు.  కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది.  విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలమని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను మాత్రం  వాయిదా వేయండి.. 

కుంభరాశి: ఈ రాశి వారు కొత్త ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. కష్టాలు.. సుఖాలు.. లాభాలు.. నష్టాలు  సమానంగా ఉంటాయి.   కేరీర్​ పరంగా.. వ్యాపార పరంగా.. ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగస్తులు ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తారు. గతంలో మీతో  గొడవపడిన వారు.. మీ సహాయాన్ని కోరే అవకాశాలున్నాయి.  కుటుంబసభ్యుల మధ్య ఉన్న వివాదాలు మధ్యవర్తి ద్వారా పరిష్కారమవుతాయి. 

మీనరాశి: ఈ రాశి వారికి  ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రతి పనికి బడ్జెట్​ కేటాయించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటివరకు చకచకా జరిగిన పనులు కూడా అడ్డంకుల వల్ల ఆలస్యమవుతాయి. ఇతరులతో మాట పడాల్సి వస్తుంది. వైవాహిక జీవితం, భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని  సమాచారం  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.