
హిందువులు...పండుగలకు... పూజలకు.. నమ్మకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పండుగ వచ్చిందంటే చాలు.. ఏ దేవుడిని పూజించాలి.. ఎలా పూజించాలి.. అలా చేయడం వలన కలిగే ఉపయోగాలేమిటి.. అనే విషయాలగురించి తెలుసుకుంటారు. దీపావళి రోజున తులసిమొక్కను పూజిస్తే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.. ఏ సమయంలో పూజించాలి.. ఎలా పూజించాలో తెలుసుకుందాం. . .!
దీపావళి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీ దేవిని ప్రసన్నమవుతుంది. నమ్మకాల ప్రకారం ఈ రోజున తులసితో కూడిన ఆచారాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు వస్తుంది. దీపావళి రోజున ప్రదోష కాల సమయం సాయంత్రం 5.45 గంటల నుంచి 8.15 గంటల వరకు ఉంది. అందువల్ల ఈ సమయాల్లో చేసే పూజలకు, ఆచరించే శుభకార్యక్రమాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
హిందూ సాంప్రదాయాల ప్రకారం.. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు.ఈ ఏడాది (2025) అక్టోబర్ 20 వ తేదీన దీపాల పండుగ జరుపుకొనేందుకు జనాలు రడీ అయ్యారు. అయితే ఆ రోజు తులసి మాతను ( తులసి మొక్కను) పూజిస్తే గతంలో ఆటంకాల వలన నిలిచిపోయిన పనుల్లో పురోగతి కలిగి పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
దీపావళి రోజున లక్ష్మి, గణేశుని పూజించడం సంప్రదాయం. ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఆచారాలు కూడా నిర్వహిస్తారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున ( అక్టోబర్ 30) విష్ణు ప్రియ తులసి మొక్కను సాంప్రదాయం, ఆచరాల ప్రకారం పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
►ALSO READ | వారఫలాలు: అక్టోబర్ 19 నుంచి 25 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.. !
పురాణాల ప్రకారం దీపావళి పండగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అమావాస్య చీకట్లని దీపాల వెలుగులతో తొలగించే దీపాల పండగను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజుని దీపావళి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు.
లక్ష్మీదేవి, గణేశుడిని కూడా పూజిస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం , శాంతి లభిస్తుందని, సిరి సంపదలకు లోటు ఉందని.. అదృష్టంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటి సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
దీపావళి నాడు తులసిని ఎలా పూజించాలంటే
దీపావళి రోజు ( అక్టోబర్ 20) తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి.. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ పరిహారం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది . సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది.
తులసి పూజ దీపావళి రోజున తులసి పూజ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆ రోజు ( అక్టోబర్ 20) ఉదయం స్నానం చేసిన తర్వాత, తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక, పెట్టి పూజ చేసి ఆవు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ వస్తువులను వివాహిత స్త్రీకి వాయినంగా అందించాలి . ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది.
దీపావళి నాడు కొద్దిగా గంగా జలం కలిపిన నీటిని తులసికి సమర్పించాలి. తులసి మంత్రాలను ( లక్ష్మీదేవి అష్టోత్తరం) కూడా జపించాలి. దీపావళి నాడు ఈ విధంగా చేసే పూజ పరిహారాల వల్ల శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీ దేవి ఆశీస్సులతో.. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని .. ఆధ్యాత్మిక వేత్తల సలహాలతో పాటు.. పురాణాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.