ఖాకీ చొక్కాలో కనిపించనున్న దీపిక పదుకొణె

ఖాకీ చొక్కాలో కనిపించనున్న దీపిక పదుకొణె

గ్లామర్ రోల్స్‌‌‌‌తో పాటు యాక్షన్ క్యారెక్టర్స్‌‌‌‌తోనూ ఆకట్టుకున్న దీపిక పదుకొణె.. ఈసారి ఖాకీ చొక్కాలో కనిపించబోతోంది. అదికూడా పాపులర్‌‌‌‌‌‌‌‌ కాప్‌‌‌‌ ఫ్రాంచైజీలో. ‘సింగం’ సిరీస్‌‌‌‌లో వరుస పోలీస్‌‌‌‌ సినిమాలు చేస్తోన్న దర్శకుడు రోహిత్ శెట్టి.. ‘సింగం ఎగైన్‌‌‌‌’ టైటిల్​తో థర్డ్ పార్ట్‌‌‌‌ని అనౌన్స్ చేశాడు. అజయ్ దేవగన్​ హీరోగా నటించే ఈ చిత్రంలో దీపిక హీరోయిన్‌‌‌‌గా నటించబోతోంది. రోహిత్ శెట్టే ఈ విషయాన్ని అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్ చేశాడు. రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ డైరెక్ట్ చేసిన ‘సర్కస్‌‌‌‌’ చిత్రంలో ‘క‌‌‌‌రెంట్ ల‌‌‌‌గా రే’ అనే స్పెషల్‌‌‌‌ సాంగ్ చేసింది దీపిక. 

గురువారం ఈ పాటను ముంబైలో లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌‌‌‌లో దీపిక కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ‘సింగం ఎగైన్‌‌‌‌’లో దీపిక క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ గురించి రివీల్ చేశాడు రోహిత్ శెట్టి. ‘లేడీ సింగం ఎప్పుడు వస్తుందని నన్ను చాలామంది పదేపదే అడుగుతుంటారు. వాళ్లందరికీ ఈరోజు స‌‌‌‌మాధానం దొరికింది. ‘సింగం ఎగైన్‌‌‌‌’లో లేడీ సింగంగా కాప్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో దీపిక నటించబోతోంది’ అని క్లారిటీ ఇచ్చాడు. సింగం, సింగం -2 సినిమాల్లో హీరోలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగా.. ఇందులో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్‌‌‌‌గా దీపిక పాత్రను హైలైట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.