ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డికి అరుదైన గౌరవం

 ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డికి అరుదైన గౌరవం

హైదరాబాద్:  ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దీపికారెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ వాసి అయిన దీపికారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు లభించాయి.

2007లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు, 2016లో తెలంగాణ రాష్ట్ర అవార్డు, దేవదాసి జాతీయ అవార్డు, అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణకంకణం, ఎఫ్‌సీసీఐ ఫ్లో ఉమన్‌ అచీవర్‌, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ‘కీర్తి’ పురస్కారం, దూరదర్శన్‌ ఏ-టాప్‌ గ్రేడ్‌ కళాకారిణిగా గుర్తింపు, రీజినల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు, నంది సినిమా అవార్డుల జ్యూరీ, తెలంగాణ ఉగాది పురస్కారాల సెలక్షన్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. దీపికారెడ్డి భర్త శ్యాంగోపాల్ రెడ్డి  బిజినెస్‌మ్యాన్‌. వారికి  ఇద్దరు పిల్లలు..  అమ్మాయి శ్లోకారెడ్డి కూచిపూడి నృత్య కళాకారిణి కాగా.. అబ్బాయి అభినవ్‌ టెన్నిస్‌ ఆటగాడు.