మోడీజీ.. మఠంలో రాజకీయాలేంటి? రామకృష్ణ మఠం ప్రతినిధులు

మోడీజీ.. మఠంలో రాజకీయాలేంటి? రామకృష్ణ మఠం ప్రతినిధులు

బేలూరు రామకృష్ణ మఠం వేదికగా ఆదివారం  ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై రామకృష్ణ మిషన్ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో వివాదాస్పద రాజకీయాలను మాట్లాడటం తమను చాలా బాధ కలిగించిందని మిషన్ సభ్యుడు గౌతమ్ రాయ్ అన్నారు.

“రామకృష్ణ మఠానికి ఓ పవిత్రత ఉంది, ఇక్కడ రాజకీయ స్వభావంతో కూడిన ప్రకటనలు చేయడానికి ఎలాంటి అనుమతి లేదు, ప్రధాని మోడి దానిని ఉల్లంఘించారు. నా పరిశీలన మేరకు RSS సంబంధాలున్న సీనియర్ అధ్యాత్మిక గురువుల ప్రోత్సాహంతో గత కొన్నేళ్లుగా రామకృష్ణ మఠం బాగా రాజకీయమైంది. మోడీ పర్యటన కూడా  అందులో భాగమేనని” రాయ్ ఓ జాతీయ మీడియా సంస్థతో అన్నారు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆదివారం  బేలూరు RK మఠం లో ప్రసంగించారు . ప్రసంగంలో సీఏఏ గురించి ప్రధాని మాట్లాడారు. ఈ కొత్త చట్టం ఎవరి పౌరసత్వాన్ని హరించదని , యువతలో ఓ వర్గం ఈ చట్టం గురించి జనాన్ని తప్పుదారి పట్టిస్తోందని మోడీ అన్నారు.