డిఫెండర్​ కెమెరా

డిఫెండర్​  కెమెరా

ఈ మధ్య ఆడవాళ్లపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే ఆడవాళ్లు సేఫ్టీ గాడ్జెట్స్​ వాడడం మంచిది. డిఫెండర్​ 24/7 అనే కంపెనీ ఒక స్మార్ట్​ పర్సనల్ ప్రొటెక్షన్​ సిస్టమ్​ని తెచ్చింది. ఇది పెప్పర్​ స్ర్పే. అంతేకాకుండా కెమెరాలాగా కూడా పనిచేస్తుంది. ఎవరైనా దాడి చేసినప్పుడు దీంతో అవతలివాళ్ల ముఖం మీద స్ర్పే చేయాలి. అదే టైంలో ఈ గాడ్జెట్​  వాళ్ల ముఖాన్ని ఫొటో తీస్తుంది. ఆ ఫొటోతోపాటు లొకేషన్​ని మనం ముందుగా సెట్​ చేసి పెట్టుకున్న ఎమర్జెన్సీ నెంబర్లకు పంపుతుంది. దీన్ని మొబైల్​తో కనెక్ట్​ చేసి వాడుకోవాలి. జీపీఎస్​, సైరన్​ ఫీచర్లు​ కూడా ఉన్నాయి ఇందులో. 

ధర: సుమారు 12,600 రూపాయలు