దేశంలో బీజేపీతోనే రక్షణ : అమిత్ షా

దేశంలో బీజేపీతోనే రక్షణ : అమిత్ షా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్‌ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) విమర్శిస్తున్న ప్రత్యర్ధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి మీరు వేసే ఓటు ద్వారా దేశాన్ని, ఢిల్లీని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. CAAకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో వందలాది మంది గత 30 రోజులుగా చేపట్టిన నిరసనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.