జగన్ సీఎం కావడం ఖాయం: రోజా

జగన్ సీఎం కావడం ఖాయం: రోజా

రేపటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే  రోజా. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన  ఆమె..ఏపీలో వైఎస్సార్సీపీ గెలవడం..జగన్ సీఎం కావడం ఖాయమని అన్నారు. తాను కూడా రెండో సారి ఎమ్మెల్యేగా నగరి నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. లగడపాటి రాజ్ గోపాల్ సర్వే దొంగ సర్వే అని.. ఈ విషయం తమిళనాడు,తెలంగాణ విషయంలో స్పష్టమైందన్నారు.  ఐదేళ్ల పాలనలో చంద్రబాబు హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని ఆరోపించారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు రోజా.