
తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. త్వరలోనే రీ షెడ్యూల్ చేస్తామని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో విద్యాసంస్థలన్నింటిని మూసివేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ మంగళవారం ప్రకటించింది. దాంతో యూనివర్సిటీలు, హాస్టళ్లు మూతపడ్డాయి. విద్యాసంస్థల మూసివేత మరియు విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న విద్యామండలి.. పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ప్రకటించింది.