
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుందని దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. 31న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ , ఆగస్టు 3న స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరగనుంది.
సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో సెల్ఫ్-ఫైనాన్స్ కోర్సులకు ఆగస్టు 11, 12 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. స్థానికేతరులు కూడా స్పాట్ అడ్మిషన్లకు అర్హులని అధికారులు స్పష్టం చేశారు.