
జీడిమెట్ల, వెలుగు: ఖరీదైన బైక్‌లను చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఈస్ట్‌గోదావరి జిల్లా అకీవీడుకు చెందిన పామర్తి హిమాన్షు (19), మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ (19) హైదరాబాద్ మియాపూర్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు మరో మైనర్‌తో కలిసి ఖరీదైన బైక్‌లను దొంగలిస్తున్నారు. ఇలా బాచుపల్లి, ఆర్సీపురం, కేపీహెచ్‌బీ పరిధిలో 9 బైక్‌లను చోరీ చేశారు. ఫిర్యాదు అందడంతో నిఘా పెట్టిన బాచుపల్లి పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.