
మెదక్ టౌన్, వెలుగు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ల జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలంలో పదుల సంఖ్యలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
ఆయా గ్రామాల రైతులు వాటిని ట్రాక్టర్లలో మెదక్ పట్టణంలోని ట్రాన్స్ఫార్మర్ రిపేర్(టీఆర్సీ) కేంద్రానికి తీసుకొచ్చారు. రెండు మూడు రోజులు అవుతున్నా ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేయడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ కిరాయిలు భారంగా మారుతున్నాయన్నారు. పాడైన ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేసి ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు.