బీసీ రిజర్వేషన్లపై వాయిదాలు దుర్మార్గం: సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ

బీసీ రిజర్వేషన్లపై వాయిదాలు దుర్మార్గం: సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ

ముషీరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కోర్టులో వాదనలు వినిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు అడగడం సరైన పద్ధతి కాదని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. కోర్టు స్టేతో బీసీ రిజర్వేషన్​లు అమలు జరగకుండా అన్యాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు.  కేసు బెంచ్ మీదికి వచ్చినప్పటికీ ప్రభుత్వ లాయర్లు వాయిదా కోరడం దుర్మార్గమన్నారు. కేసు బీసీల పక్షాన గెలుస్తుందని భయంతోనే స్టే కొనసాగాలని ప్రభుత్వం కోరుతుందని తెలిపారు. మరోవైపు పార్టీ పరంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న వాగ్దానం ఆచరణలో ఎక్కడా కనబడడం లేదని ఆర్.కృష్ణయ్య 

విమర్శించారు.