ఆర్చ్ పై ముత్తిరెడ్డి పేరు తొలగింపు

ఆర్చ్ పై ముత్తిరెడ్డి పేరు  తొలగింపు
  •  మాజీ ఎమ్మెల్యే పేరు పెట్టడంపై అభ్యంతరం

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఏర్పాటు చేస్తున్న ఆర్చ్​పై  ఉన్న మాజీ  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరును  మున్సిపల్​ అధికారులు తొలగించారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన ఆర్చ్​కు  ముత్తిరెడ్డి పేరు పెట్టడంపై సొంత పార్టీ బీఆర్​ఎస్​ నేతలు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ముత్తిరెడ్డి పేరుతో ఉన్న ఆర్చ్​ను తొలగించాలని మున్సిపల్​ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఇవాళ సిబ్బంది పేరును తీసేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో బతుకమ్మ కుంటను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడని ముత్తిరెడ్డిపై జిల్లా ఉన్నతాధికారి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.