ఒకే బిల్డింగులో 41 మందికి వైరస్

ఒకే బిల్డింగులో 41 మందికి వైరస్

న్యూఢిల్లీ: ఒకే భవనంలోని 41 మందికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ కపాషెరా ప్రాంతంలోని ఒక బిల్డింగ్​లో నివాసం ఉంటున్న 41 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అధికారులు శనివారం మీడియాకు తెలిపారు. ఇదే భవనంలో ఉంటున్న ఒకరికి ఏప్రిల్ 18న కరోనా సోకడంతో మిగతా వారందరి శాంపిల్స్ కలెక్టు చేసుకుని ముందు జాగ్రత్త చర్యగా బిల్డింగ్ ఖాళీ చేయించామన్నారు. వారి నమూనాలను నోయిడాలోని టెస్టింగ్ సెంటర్ కు పంపగా 41 మందికి రిజల్ట్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజులోనే కొత్తగా 223 పాజిటివ్ కేసులు ఫైల్ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 3,738 మంది వైరస్ బారిన పడ్డారు. 61మంది చనిపోయారు.