ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొల్యూషనే కీలకం

V6 Velugu Posted on Nov 16, 2019

న్యూఢిల్లీ:  ఎయిర్​పొల్యూషన్. ఈ మాట చెప్పగానే ఇప్పుడు వెంటనే గుర్తొచ్చే సిటీ ఢిల్లీ. తీవ్రమైన వాయు కాలుష్యంతో ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిస్తుందని ఓ తాజా సర్వే చెబుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును ప్రస్తుత పొల్యూషన్​ప్రాబ్లం ప్రభావితం చేస్తుందని ప్రతి పది మంది ఢిల్లీ రెసిడెంట్లలోనూ ఎనిమిది మంది అభిప్రాయపడినట్టు వెల్లడించింది. జెన్​ఎక్స్(1960 నుంచి 1980 మధ్య పుట్టినవారు) రెస్పాండెంట్లతో పోలిస్తే మిలీనియల్స్(1981 నుంచి 1996 మధ్య పుట్టినవారు), జెన్​జెడ్(1996 తర్వాత పుట్టినవారు) రెస్పాండెంట్లు ఎక్కువగా ఈ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పొల్యూషన్​ ప్రభావానికి సంబంధించి ఇంటర్నెట్​ బేస్డ్ మార్కెట్​ రిసెర్చ్, డేటా ఎనలిస్ట్​సంస్థ యూగౌ ఈ సర్వే చేసింది. నవంబర్​లో 750 మంది ఢిల్లీ రెసిడెంట్ల రెస్పాన్స్​ బట్టి ఈ సర్వే చేసింది.

కేంద్రం, రాష్ట్రానిదే బాధ్యత

ఎయిర్​పొల్యూషన్ ప్రాబ్లమ్​కు ఎవరు పరిష్కారం చూపాలన్న దానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్​కు ఇందులో బాధ్యత ఉందని మెజారిటీ(61 శాతం మంది) జనం చెప్పారు. ఇదే సమయంలో ప్రతి ఆరుగురిలో ఒకరు సెంట్రల్ గవర్నమెంటే దీనిని పరిష్కరించాలంటే.. అంతే మంది స్టేట్​ గవర్నమెంట్​దే ఆ బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఎన్విరాన్మెంట్ తర్వాత నిరుద్యోగం, ఎడ్యుకేషన్, వుమెన్ రైట్స్, సేఫ్టీపై జనం ఎక్కువ స్పందించినట్టు ఈ సర్వే తెలిపింది. ప్రతి ఒక్కరూ లేవనెత్తిన టాప్​ 3 అంశాల్లో ఎడ్యుకేషన్ ఒకటిగా ఉంది. మిగతా ఏజ్​ గ్రూపుల వారితో పోలిస్తే జెన్​జెడ్ రెస్పాండెంట్లు ఎక్కువగా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. యూత్​తో పోలిస్తే ఓల్డర్​ జెనరేషన్​ వారు బేసిక్ సర్వీసులకే ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇచ్చారు. తమ సమస్యల్లో ఎక్కువ శాతాన్ని ఆమ్​ఆద్మీ పార్టీ(ఆప్) పరిష్కరిస్తుందని యంగ్​ జెనరేషన్​భావిస్తే.. ఓల్డర్​ జెనరేషన్ వారు బీజేపీపై నమ్మకం ఉంచినట్టు ఈ సర్వే వెల్లడించింది

పెరుగుతున్న పొల్యూషన్

ఢిల్లీ ఎయిర్​ పొల్యూషన్​ గత కొద్దిరోజులుగా గ్లోబల్​ హెడ్​లైన్స్​ను తాకుతోంది. సూపర్​ పవర్​గా మారాలనుకుంటున్న ఇండియాకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. దేశ రాజధానిలో ఎయిర్​పొల్యూషన్​ పెరిగిపోవడం అంతర్జాతీయ టూరిస్టులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు ఇస్తోంది. శుక్రవారం ఎయిర్​ క్వాలీటీ ఇండెన్స్​ 528కి చేరింది. గురువారం పీఎం 10 కౌంట్ 583కి, పీఎం 2.5 కౌంట్ 378 చేరడంపై ఎయిర్​ ఎమర్జెన్సీ ప్రకటించారు.

Tagged ELECTIONS, delhi air pollution, key role play

Latest Videos

Subscribe Now

More News