Delhi artificial rain: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్.. సాయంత్రం 7గంటల లోపు కృత్రిమ వర్షం!

Delhi artificial rain: ఢిల్లీలో క్లౌడ్  సీడింగ్  ట్రయల్స్ సక్సెస్.. సాయంత్రం 7గంటల లోపు కృత్రిమ వర్షం!

దీపావళీ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. కాలుష్యం తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది..ఇందులో భాగంగా మంగళవారం ( అక్టోబర్​ 28) క్లౌడ్​సీడింగ్​ విజయవంతంగా నిర్వహించింది. క్లౌడ్​ సీడింగ్​ ప్రభావంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం కృత్రిమ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉందని అధికారులు ప్రకటించారు. అధికారులు చెప్పిన ప్రకారం.. సాయంత్రం 7 గంటల లోపు లేదా కొన్ని గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. 

క్లౌడ్​ సీడింగ్​ ట్రయల్ విధానంలో విమానం ద్వారా మేఘాల్లోకి సిల్వర్ ఐఓడైడ్ (Silver iodide) లేదా సాల్ట్ (Sodium chloride) వంటి రసాయనాలు విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షాలకు కురిపించే ప్రక్రియను సక్సెస్​ ఫుల్​ గా నిర్వహించారు. ఇదే రోజు రెండో సారి క్లౌడ్​ ట్రయల్​ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 25న  క్లౌడ్​ సీడింగ్​ ట్రయల్స్​కు ఢిల్లీ ప్రభుత్వం IIT Kanpur-తో కలిసి  ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. 

కృత్రిమ వర్షం అంటే..

క్లౌడ్ సీడింగ్ అంటే అయోడైడ్ స్ఫటికాలు లేదా ఉప్పు సమ్మేళనాలు వంటి కణాలను తేమ అధికంగా ఉండే మేఘాలలోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షపాతం సృష్టించడం. విమానం ద్వారా విడగొట్టిన అయోడైడ్​ స్పటికాల కణాలను వినియోగిస్తారు. ఇవి చిన్న బిందువులు పెద్దవిగా కలిసిపోవడానికి సహాయపడతాయి. ఫలితంగా వర్షం కురుస్తుందని అధికారులు చెబుతున్నారు. 

దీపావళి తర్వాత ఢిల్లీ, ఎన్​ సీఆర్​ వాయు కాలుష్యం పెరిగిపోయింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 2వ దశ అమలులో ఉన్నప్పటికీ AQI  ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో చాలా పేలవంగా నమోదు అయింది. వాయు కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం క్లౌడ్​ సీడింగ్​చేపట్టింది.