సన్ రైజర్స్ కు షాక్..ఎలిమినేటర్ లో ఢిల్లీ విక్టరీ

సన్ రైజర్స్ కు షాక్..ఎలిమినేటర్ లో ఢిల్లీ విక్టరీ

అదృష్టం కలిసొచ్చి ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించినసన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌ ను దురదృష్టం వెంటాడింది.సాగర తీరంలో బుధవారం ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా జరిగిన ఎలిమినేటర్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పృథ్వీషా (38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్‌ సెంచరీకి రిషబ్‌ పంత్‌ (21 బంతుల్లో 2ఫోర్లు, 5 సిక్సర్లతో 49) కీలక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోడవడంతో సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌ ను ఓడించి క్వాలిఫయర్‌- 2 పోరుకు అర్హతసాధించింది. తొలుత సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌ 20ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (19 బంతుల్లో 1 ఫోర్‌ , 4 సిక్సర్లతో 36), మనీశ్‌ పాండే (36 బంతుల్లో 3 ఫోర్లుతో 30), కేన్‌ విలియమ్సన్‌ (27 బంతుల్లో 2 ఫోర్లుతో 28) రాణించారు.ఢిల్లీ బౌలర్లలో కిమో పాల్‌ (3/32) మూడు వికెట్లుతీయగా, ఇషాంత్ శర్మ(2/34) రెండు వికెట్లుతీశాడు. అనంతరం పృథ్వీ, పంత్‌ మెరుపులతో ఢిల్లీమరో బంతి మిగిలుండగా ఎనిమిది వికెట్లు కోల్పోయి టార్గెట్‌ ను అందుకుంది. రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో ఖలీల్‌ ,రషీద్‌ , భువనేశ్వర్‌ రెండేసి వికెట్లు తీశారు.

పృథ్వీ , పంత్ఫటాఫట్

తొలుత పృథీ షా, చివర్లో రిషబ్‌ పంత్‌ విధ్వంసం సృష్టించడంతో సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్దేశిం చిన లక్ష్యాన్నిఢిల్లీ చేధించింది. తొలుత ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్‌ధవన్‌ (17) ఛేజింగ్‌ ను అదిరిపోయే రీతిలో ప్రారంభించారు. ముఖ్యంగా పృథ్వీ షా రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. నబీ వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతికి అతనిచ్చిన సులువైన క్యాచ్‌ ను థంపి నేలపాలు చేశాడు. ఈ లైఫ్‌ ను సద్వినియోగం చేసుకున్న షా.. భువీ వేసిన తర్వాతి ఓవర్‌ లో వరుసగా4, 6, 4 కొట్టాడు. ధవన్‌ కూడా ధాటిగా ఆడడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్ట పోకుండా 55 పరుగులు చేసింది. అయితే ఎనిమిదో ఓవర్‌ లోధవన్‌ వికెట్‌ తీసిన హుడా ఢిల్లీకి బ్రేకులేశాడు. జోరుకొనసాగిం చిన పృథ్వీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగాసగం ఓవర్లకు ఢిల్లీ 84/1తో బలమైన స్థితిలోనిలిచిం ది. అయితే తర్వాతి ఓవర్లోనే పృథ్వీతో పాటుకెప్టె న్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (8)ను ఔట్‌ చేసి న ఖలీల్మ్యాచ్‌ ను మలుపుతిప్పా డు. ఈ దశలో రిషబ్‌ పంత్‌ ,మన్రో(14) జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు.థంపి వేసిన 14వ ఓవర్లో 4, 6 కొట్టిన మన్రో జట్టుపైఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే 15వఓవర్‌ ను మెయిడిన్‌ చేసిన రషీద్‌ ఖాన్‌ మన్రో, అక్షర్‌ పటేల్‌ (0) వికెట్లు తీసి రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రేసులోకి తెచ్చాడు.కానీ, పంత్‌ పోరాటం వదల్లేదు. రూథర్‌ ఫర్డ్‌ (9)జతగా స్లాగ్‌ ఓవర్లలో చెలరేగిపోయాడు. నబీ, భువీ ఓవర్లో పంత్‌ , రూథర్‌ ఫర్డ్‌ చెరో సిక్సర్‌ కొట్టి రన్‌ రేట్‌ పడిపోకుండా చూసుకున్నా రు. ఆపై, థంపి వేసిన18వ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగినరిషబ్‌ మ్యాచ్‌ ను లాగేసుకున్నా డు. భువీ బౌలింగ్‌ లో ఇంకో సిక్సర్‌ కొట్టిన అతను తర్వాత నబీకి క్యాచ్‌ ఇవ్వడంతో రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిబిరంలో ఆశలు రేగాయి. ఖలీల్‌వేసిన ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌ లో హైడ్రామా నడిచింది.విజయానికి రెండు రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమైన దశలో నాలుగోబాల్‌ కు సింగిల్‌ కోసం యత్నించిన మిశ్రా (1) లైన్‌ ను మార్చుకుని అబస్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌ గా వెనుదిరిగాడు.ఐదో బాల్‌ కు బౌండ్రీ కొట్టిన కిమో పాల్‌ (4 నాటౌట్)మ్యాచ్‌ ను ముగించాడు.

రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పడుతూ లేస్తూ

సాగరతీరంలో సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోలర్‌ కోస్ట ర్‌రైడ్‌ ను తలపించింది. భారీ షాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బ్యాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చిన ప్రతీసారి రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌కోల్పోతూ వచ్చింది. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు బ్యాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌ పై ఒత్తిడిపెంచడంతో ఆరెంజ్‌ ఆర్మీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌ కు దిగిన సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్టిన్‌ గప్టిల్‌ ధాటిగా ఆరంభించాడు.ఇషాంత్‌ వేసిన రెండో ఓవర్‌ లో కళ్లు చెదిరే భారీసిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టిన గప్టిల్‌ .. ఆ తర్వా త బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బాది ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊపుతెచ్చాడు. అయితే ఇషాంత్‌ వేసిన తర్వాతి ఓవర్‌ లో భారీషాట్‌ కు యత్నించిన మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా(8) మిడాఫ్‌ లో శ్రేయస్‌ అయ్యర్‌ కుసులువైన క్యాచ్‌ ఇచ్చాడు. అదే ఓవర్లో ఫోర్‌ బాదిన గప్టిల్‌ .. ఆ తర్వా త అక్షర్‌ బౌలింగ్‌ లో మరో సిక్సర్‌ బాదాడు. మనీశ్‌ పాండే వచ్చీరాగానే ఇషాం త్‌ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లుబాదాడి జోరు చూపాడు. పవర్‌ ప్లే తర్వా త స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా రాకతో సీన్‌ మారింది. ఏడో ఓవరో గప్టిల్‌ ను ఔట్‌ చేసిన మిశ్రా హైదరాబాద్‌ వేగానికి కళ్లెంవేశాడు. అతను కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాండేతోపాటు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. మిశ్రా వేసిన 11 ఓవర్లో కీపర్‌ పంత్‌ క్యాచ్‌ వదిలే యడంతో కేన్‌ కు లైఫ్‌ వచ్చింది.కానీ, 13వ ఓవర్లో స్లోబాల్‌ తో పాండేను పెవిలియన్‌ చేర్చిన కీమోపాల్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టాడు. జట్టుస్కోరు వంద దాటిన వెంటనే ఇషాంత్‌ బౌలింగ్‌ లోవిలియమ్సన్‌ బౌల్డ్‌ అవడంతో హైదరాబాద్‌ తడబడింది. ఈ దశలో ఆల్‌ రౌండర్‌ మహ్మద్‌ నబీ (13బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 20), విజయ్‌ శంకర్‌(11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25) భారీషాట్లతో ఎదురుదాడికి దిగారు. అక్షర్‌ వేసిన 17వఓవర్లో నబీ ఫోర్‌ , శంకర్‌ సి క్సర్‌ బాది ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చా రు. ఆపై, పాల్‌ బౌలింగ్‌ లో చెరో బౌం డ్రీరాబట్టారు. బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన 19వ ఓవర్లో 4, 6 కొట్టినవిజయ్‌ మరో భారీ షాట్‌ ఆడి మిడ్‌ వికెట్‌ లో అక్షర్‌కు చిక్కాడు. కిమో పాల్‌ వేసిన చివరి ఓవర్లో ఓ సిక్సర్‌ బాదిన నబీ తర్వాతి బాల్‌ కు ఔటయ్యాడు. దీపక్‌హుడా (4), రషీద్‌ (0) వికెట్లు కూడా కోల్పోయిన రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఓవర్లో 11 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టి ప్రత్యర్థి ముందు 160 ప్లస్‌ టార్గెట్‌ ఉంచింది.