ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయబోతుంది. కాగా ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచులో గెలిచి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ చూస్తుండగా, ఈ మ్యాచులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే పట్టుదలతో పంజాబ్ ఉంది.
ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి మాకు అంతా సవ్యంగా జరుగుతున్న విషయం ఏదైనా ఉందంటే అది టాస్ గెలవడమే.. మేము టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాం.. గత మ్యాచుల్లో మేము మరీ దారుణంగా ఏమీ ఆడలేదు.. కానీ బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్.. ఇలా ఏదో ఒక విభాగంలో కీలకమైన సమయాల్లో (Crucial Moments) పట్టు కోల్పోయాం.. అందుకే ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు.. ఈ మ్యాచ్ కోసం మా జట్టులో ఐదు మార్పులు చేశామని అక్షర్ అన్నారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము కూడా ఫస్ట్ బౌలింగ్ తీసుకునే వాళ్లమని తెలిపారు. మేము ఫలితం గురించి అతిగా ఆలోచించడం లేదు.. గెలుపోటములతో సంబంధం లేకుండా, మాదైన శైలిలో (Brand of Cricket) నిర్భయంగా ఆడాలనుకుంటున్నాం.. ఒక మంచి క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించడమే మా లక్ష్యం.. ఇది సరికొత్త వికెట్.. కొత్త బంతితో ఆరంభంలో మూవ్‌మెంట్ ఉండే అవకాశం ఉందన్నాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: KL రాహుల్( వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ ద్వార్షుయిస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
