తొలిసారి ఐపీఎల్ ఫైనల్ కి ఢిల్లీ క్యాపిటల్స్

తొలిసారి ఐపీఎల్ ఫైనల్ కి ఢిల్లీ క్యాపిటల్స్

ధవన్‌ (50 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 78) దంచిండు..! హెట్‌మయర్‌‌ (22 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 42నాటౌట్‌) ఎడాపెడా కొట్టిండు..! స్టోయినిస్‌ (27 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 38; 3/26), రబాడ (4/29) బాల్‌‌తోరెచ్చిపోయిన్రు..! ఇంకేముంది.. ఢిల్లీ దెబ్బకు హైదరాబాద్‌‌ వణికిపోయింది..! కండ్లముందున్న పరుగుల కొండనుకరిగించలేక.. వీరులు అనుకున్న మనోళ్లుబ్యాట్లెత్తే సిన్రు..! ఎప్పట్లాగే విలియమ్సన్‌ (45 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో67) ఒక్కడే పోరాడినా సన్‌రైజర్స్‌‌ను గట్టెక్కించలేకపోయిండు..! దీంతో క్వాలిఫయర్‌‌-2లో డేర్‌‌గా గెలిచిన ఢిల్లీ..తొలిసారి ఐపీఎల్ ఫైనల్లోకి చేరగా, పోరాడి ఓడిన ఆరెంజ్‌ ఆర్మీ ఉత్త చేతులతో ఇంటిముఖం పట్టింది..!!

ఐపీఎల్‌‌ లాస్ట్‌ స్టేజ్‌‌లో అద్భుత విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు.. ఢిల్లీ క్యాపిటల్స్ ‌‌చెక్‌‌ పెట్టింది.సంచలన బౌలింగ్‌‌తో విజయానికి చేరువగా వచ్చిన ఆరెంజ్‌‌ ఆర్మీకి సూపర్‌‌గా అడ్డుకట్ట వేసింది. దీంతో ఆదివారం జరిగిన క్వాలిఫయర్‌‌–2లో ఢిల్లీ 17 రన్స్‌ తేడాతో హైదరాబాద్‌‌పై గెలిచి ఫస్ట్టైమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్‌‌గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ 20ఓవర్లలో 3 వికెట్లకు189 రన్స్ ‌‌చేసింది.తర్వాత హైదరాబాద్‌‌ 20ఓవరలో్ల 8వికెట్లకు172రన్స్‌‌కే పరిమితమైంది. విలియమ్సన్‌‌తో పాటు సమద్‌‌(16 బాల్స్‌‌లో2 ఫోర్లు, 2 సిక్సరతో్ల 33) ఫర్వాలేదనిపించాడు.స్టోయినిస్కు‘మ్యాన్‌ ఆఫ్ ‌‌ద మ్యాచ్‌‌’ లభించింది.

ఓపెనింగ్ అదుర్స్‌‌..

కీలక మ్యాచ్‌‌ కావడంతో ఢిల్లీ ఓపెనింగ్‌‌లో మార్పులు చేసింది. ధవన్‌‌కు జతగా హిట్టర్‌‌ స్టోయినిస్‌‌ను  పంపింది. ఇది బాగా సక్సెస్‌‌ అయ్యింది. సందీప్‌‌  వేసిన ఫస్ట్‌‌ ఓవర్‌‌లోనే కుదురుకున్న ఈ జోడీ.. మ్యాచ్‌‌ ముందుకెళ్లేకొద్ది బ్యాట్‌‌ ఝుళిపించింది. సెకండ్‌‌ ఓవర్‌‌లో ధవన్‌‌ ఫోర్‌‌ కొడితే, తర్వాతి ఓవర్‌‌లో స్టోయినిస్‌‌ రెండు దంచాడు.  మూడో ఓవర్‌‌లో క్యాచ్‌‌ డ్రాప్‌‌ నుంచి గట్టెక్కిన స్టోయినిస్‌‌.. హోల్డర్‌‌ వేసిన నాలుగో ఓవర్‌‌లో 4, 4, 6, 4తో 18 రన్స్‌‌ పిండుకున్నాడు. ఆ వెంటనే ధవన్‌‌  రెండు ఓవర్లలో కలిపి 4, 4, 6 బాదడంతో పవర్‌‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 65 రన్స్‌‌ చేసింది. ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన రషీద్‌‌ (1/26) తన ఫస్ట్‌‌ ఓవర్‌‌లో 11 రన్స్‌‌ ఇచ్చుకున్నా.. సెకండ్‌‌ ఓవర్‌‌లో షాకిచ్చాడు.  9వ ఓవర్‌‌లో నిలకడగా ఆడుతున్న స్టోయినిస్‌‌ను .. సూపర్‌‌ రిప్పర్‌‌తో క్లీన్‌‌బౌల్డ్‌‌ చేశాడు. దీంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 86 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన అయ్యర్‌‌ (21) ఏమాత్రం తొందరపడలేదు. నదీమ్‌‌ వేసిన 10వ ఓవర్‌‌లో ధవన్‌‌ 6తో 13 రన్స్‌‌ రాబట్టడంతో టీమ్‌‌ స్కోరు 100 దాటింది. అదే క్రమంలో శిఖర్‌‌ 26 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. అయితే 11వ ఓవర్‌‌ నుంచి లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌లో మార్పులు చేసుకోవడంతో తర్వాతి రెండు ఓవర్లు 10 రన్సే వచ్చాయి. దీంతో ఒత్తిడికి గురైన అయ్యర్‌‌.. భారీ షాట్‌‌కు ప్రయత్నించి 14వ ఓవర్‌‌లో వెనుదిరిగాడు. రెండో వికెట్‌‌కు 40 రన్స్‌‌ సమకూరాయి. లాస్ట్‌‌ ఐదు ఓవర్లలో 37 రన్సే రావడంతో ఢిల్లీ స్కోరు 15 ఓవర్లలో 139/2గా మారింది. ఇన్నింగ్స్‌‌లో వేగం తగ్గడంతో.. హెటమయర్‌‌ దూకుడు మొదలుపెట్టాడు. నటరాజన్‌‌ వేసిన 17వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌ను స్టాండ్స్‌‌లోకి పంపడంతో 13 రన్స్‌‌ వచ్చాయి. నెక్ట్స్‌‌ ఓవర్‌‌లో హెట్‌‌మయర్‌‌ 4, 4, 4  ధవన్‌‌ 4తో 18 రన్స్‌‌ రాబట్టారు. తర్వాతి ఓవర్‌‌లో ధవన్‌‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌‌ను రషీద్‌‌ వదిలేశాడు. కానీ మూడో బాల్‌‌కు ఎల్బీగా వెనుదిరగడంతో మూడో వికెట్‌‌కు 52 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. లాస్ట్‌‌ ఓవర్‌‌లో పంత్‌‌ (2 నాటౌట్‌‌), హెట్‌‌మయర్‌‌ 7 రన్స్‌‌ చేయడంతో ఢిల్లీ మంచి టార్గెట్‌‌ నిర్దేశించింది.

విలియమ్సన్‌‌ మినహా…

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌కు ఏదీ కలిసి రాలేదు. సిక్సర్‌‌తో గార్గ్‌‌ (17) టచ్‌‌లోకి వచ్చినా.. రబాడ ఇన్‌‌స్వింగర్‌‌కు వార్నర్‌‌ (2) సెకండ్‌‌ ఓవర్‌‌లోనే వెనక్కి వచ్చేశాడు. 12 రన్స్‌‌ వద్ద ఫస్ట్‌‌ వికెట్‌‌ పడటంతో ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే బాధ్యత పాండే (21)పై పడింది. ఫోర్‌‌తో ఖాతా తెరిచిన పాండే… మరో బౌండ్రీతో జోష్‌‌లోకి వచ్చాడు. మూడో ఓవర్‌‌లో రెండో సిక్సర్‌‌తో గార్గ్‌‌ జోరు పెంచాడు. కానీ ఐదో ఓవర్‌‌లో బౌలింగ్‌‌కు దిగిన స్టోయినిస్‌‌ డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. మూడు బాల్స్‌‌ తేడాలో గార్గ్‌‌, పాండేను ఔట్‌‌ చేయడంతో ఇన్నింగ్స్‌‌ మరోసారి తడబడింది. ఈ టైమ్‌‌లో విలియమ్సన్‌‌, హోల్డర్‌‌ (11) ఆచితూచి ఆడారు. ఆరో ఓవర్‌‌లో ఫోర్‌‌ కొట్టిన హోల్డర్‌‌.. ఫీల్డింగ్‌‌ను సడలించిన తర్వాత సింగిల్స్‌‌తో సరిపెట్టుకున్నాడు. స్పిన్నర్లు వచ్చినా భారీ షాట్లు ఆడకపోవడంతో రన్‌‌రేట్‌‌ తగ్గింది. 10వ ఓవర్‌‌లో విలియమ్సన్‌‌ సిక్సర్‌‌ బాదడంతో 11 రన్స్‌‌ వచ్చాయి. పవర్‌‌ప్లేలో 49/3 ఉన్న స్కోరు ఫస్ట్‌‌ టెన్‌‌ ముగిసేసరికి 75/3గా మారింది. 11వ ఓవర్‌‌ నుంచి విలియమ్సన్‌‌ కొద్దిగా గేర్‌‌ మార్చాడు. రబాడ బాల్‌‌ను రెండో సిక్సర్‌‌గా మలిచిన కేన్‌‌.. తర్వాతి ఓవర్‌‌లోనూ 4, 6 బాదాడు. కానీ మధ్యలో హోల్డర్‌‌ ఔట్‌‌కావడంతో నాలుగో వికెట్‌‌కు 46 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే మరో సిక్స్‌‌ కొట్టిన విలియమ్సన్‌‌ 35 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ కంప్లీట్‌‌ చేశాడు. అవతలివైపు సమద్‌‌ కూడా 6, 4, 4తో 16 రన్స్‌‌ రాబట్టడంతో 15 ఓవర్లలో హైదరాబాద్‌‌ 129/4 స్కోరు చేసింది. ఇక 30 బాల్స్‌‌లో 61 రన్స్‌‌ చేయాల్సిన దశలో విలియమ్సన్‌‌ ఫోర్‌‌ కొట్టడంతో 16వ ఓవర్‌‌లో 10 రన్స్‌‌ వచ్చాయి. కానీ వేగంగా ఆడే ప్రయత్నంలో కేన్​ ఔట్‌‌కావడంతో ఐదో వికెట్‌‌కు కీలకమైన 57 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ ఓవర్‌‌లో 9 రన్సే వచ్చాయి. రషీద్‌‌ (11) 6, 4తో 12 రన్స్‌‌ చేశాడు. దీంతో విజయసమీకరణం 12 బాల్స్‌‌లో 30గా మారింది. 19వ ఓవర్‌‌లో రబాడ సిక్సర్‌‌ ఇచ్చి సమద్‌‌, రషీద్‌‌, గోస్వామి (0)ని ఔట్‌‌ చేసి మ్యాచ్‌‌ను లాగేసుకున్నాడు.